‘Proning’ Technique : ఆ టెక్నిక్స్‌తో ఆక్సిజన్ సమస్యను అధిగమించిన వృద్ధురాలు

‘Proning’ Technique : ఆ టెక్నిక్స్‌తో ఆక్సిజన్ సమస్యను అధిగమించిన వృద్ధురాలు

82 Year Old Up Woman Beats Covid 19 Using The Proning Technique

‘proning’ technique : ఆక్సిజన్..ఆక్సిజన్..ఆక్సిజన్. కరోనా కేసులు పెరుగుతున్నవేళ ప్రాణవాయువు విలువేంటో తెలిసింది జనాలకు. దీంతో ఆక్సిన్ కోసం క్యూలు కడుతున్నారు. గుండెల నిండా శ్వాస తీసుకోవాటానికి నానా అవస్థలు పడుతున్నారు. ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కరోనా బారిన పడుతున్నజనాలకు ఆక్సిజన్ అవసరం బాగా పెరిగిపోయింది. కానీ ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తోంది. కానీ అన్నింటికీ ప్రత్యామ్నాయం ఉంటుందన్నట్లుగా 86 ఏళ్ల బామ్మ ఆక్సిజన్ సమస్యకు చిటికెలో పరిష్కారాన్ని కనిపెట్టేసింది. బోర్లా పడుకుని ఆక్సిజన్ సమ్యను అధిగమించేసి కరోనా మహమ్మారికి చెక్ పెట్టేసింది. proning (బోర్లా పడుకోవటం)టెక్నిక్ తో కరోనా నుంచి కోలుకుంది యూపీకి చెందిన 82 ఏళ్ల వృద్ధురాలు.

కాగా..కరోనా బారిన పడుతున్న చాలా మందికి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. దీంతో ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ సమస్యకు (proning) బోర్లా పడుక్కోవడం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఇటీవలి కాలంలో నిపుణులు సూచిస్తున్నారు. ఆ టెక్నిక్ నే పాటించి ప్రాణాలతో బైటపడింది బామ్మ.

ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌కు చెందిన 82 ఏళ్ల విద్యాదేవి అనే వృద్ధురాలు ఈ ప్రోనింగ్ టెక్నిక్స్‌తోనే కరోనా బారి నుంచి తప్పించుకుంది. అలీ నగర్‌కు చెందిన విద్యాదేవి కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన కొద్ది రోజులకే ఆమె అక్సిజన్ స్థాయిలు 79కి పడిపోయాయి. ఆ సమయంలో ప్రోనింగ్ ప్రారంభించడంతో నాలుగు రోజుల్లో ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 94కి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 97గా ఉన్నాయని ఆమె కుమారుడు తెలిపారు. ప్రస్తుతం ఆమె కరోనానుంచి కేవలం 12 రోజుల్లోనే కరోనాపై విజయం సాధించింది.