Sexual Harassment : ఏడాదిన్న‌ర‌గా లైంగిక వేధింపులు..బాలిక ఆత్మహత్య

బాలిక‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేసిన నిందితులు ఆమె అభ్యంత‌ర‌క‌ర వీడియోను తీసి బ్లాక్‌మెయిల్‌కు గురిచేశారు. ఆమెను బ‌లవంతంగా వ్య‌భిచార రొంపిలోకి దింపేందుకు ఒత్తిడి చేశారు.

Sexual Harassment : ఏడాదిన్న‌ర‌గా లైంగిక వేధింపులు..బాలిక ఆత్మహత్య

Suicide (1)

Sexual Harassment : మ‌హారాష్ట్ర‌లో దారుణం జరిగింది. ఏడాదిన్న‌ర‌ కాలంగా లైంగిక వేధింపులకు గురవుతున్న బాలిక ఆత్మహత్యకు పాల్ప‌డింది. థానే స‌మీపంలోని క‌ళ్యాణ్‌లో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌ మూడో అంత‌స్తు నుంచి కింద‌కు దూకి బాలిక ఆత్మ‌హ‌త్య‌ చేసుకుంది. బాధితురాలి మొబైల్ ఫోన్ నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించ‌డంతో ఏడాదిన్న‌ర‌గా ఆమె ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, మాన‌సిక ఒత్తిడి వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌హిళ స‌హా ఎనిమిది మంది నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలిక‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేసిన నిందితులు ఆమె అభ్యంత‌ర‌క‌ర వీడియోను తీసి బ్లాక్‌మెయిల్‌కు గురిచేశారు. ఆమెను బ‌లవంతంగా వ్య‌భిచార రొంపిలోకి దింపేందుకు ఒత్తిడి చేశారు. మృతురాలి స్నేహితురాలు మ‌రో ఏడుగురు.. బాధితురాలిని లైంగిక వేధింపుల‌కు గురిచేయ‌డంలో స‌హ‌క‌రించింద‌ని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Minors Gang Rape Girl : దారుణం.. 11ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

నిందితులు స‌న్నీ పాండే, విజ‌య్ యాదవ్‌, ప్ర‌యం తివారీ, శివం పాండే, కృష్ణ జైస్వాల్‌, ఆనంద్ దూబే, నిఖిల్ మిశ్రా, కాజ‌ల్ జైస్వాల్‌గా గుర్తించారు. నిందితులు ప‌లుకుబ‌డి క‌లిగిన వారు కావడంతో పోలీసులు వారిపై చ‌ర్య‌లు తీసుకోలేదని విఫ‌ల‌మ‌య్యార‌ని బాధితురాలి తండ్రి ఆరోపించారు. త‌మ కుమార్తెపై లైంగిక దాడి చేసి ఆపై బ్లాక్‌మెయిల్ చేశార‌ని, టెర్ర‌స్ పైనుంచి తోసివేశార‌ని ఆయ‌న తెలిపారు. త‌మ కుటుంబానికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు.