Fire Broke Out : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన ఇళ్లు
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుల్తాన్ పూర్ లోని మురికివాడలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇళ్లన్నీ తగలబడ్డాయి.

fire broke out
fire broke out : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుల్తాన్ పూర్ లోని మురికివాడలో మంటలు చెలరేగాయి. భారీగా అగ్ని కిలలు ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇళ్లన్నీ తగలబడ్డాయి.
చుట్టు పక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనస్థలికి చేరుకుని రంగంలోకి దిగింది. 15 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Fire Accident : రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఎయిర్ పోర్టు సమీపంలోనే ఘటన
రెస్క్యూలో ఫైర్ సిబ్బంది రోబోలను కూడా వినియోగించి మంటలను ఆర్పివేశారు. అయితే ఆస్తి నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.