జులై లో భారత్ లో 8లక్షలకు చేరనున్న కరోనా కేసులు

  • Published By: venkaiahnaidu ,Published On : June 16, 2020 / 09:15 AM IST
జులై లో భారత్ లో 8లక్షలకు చేరనున్న కరోనా కేసులు

భారత్ లో వచ్చే నెల రోజుల్లో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఖరీదైన లాక్ డౌన్ ను విడిచిపెట్టి భారతదేశం ప్రస్తుతం ఆన్ లాక్ 1.0లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఈ సమయంలో దేశంలో వైరస్ వ్యాప్తి వేగంగా వుంది. వచ్చే నెలలో(జులై)భారత్ లో కరోనావైరస్ వ్యాప్తి దాదాపు మూడు రెట్లు పెరిగి 800,000 కేసులు నమోదయ్యే అవకాశముందని  మిచిగన్ యూనివర్సిటీ సైంటిస్టులు అంచనా వేశారు.

మిచిగాన్ విశ్వవిద్యాలయంలోని డేటా శాస్త్రవేత్తల బృందం అంచనా ప్రకారం….ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న 2వ దేశమైన బ్రెజిల్ కు చేరువగా భారత్ ఉండనుంది. లాటిన్ అమెరికన్ దేశమైన బ్రెజిల్ ను భారత్ అధిగమించే దిశగా దేశంలో ప్రస్తుతం వైరస్ కేసులు నమోదవువుతున్న తీరు కనిపిస్తోంది.

ఇప్పట్లో భారత్….  పీక్ స్టేజ్ ను చూసే అవకాశం లేదని,ఇది సమయానికి మరింత ముందుకు వస్తుందని భారతదేశం యొక్క అంటువ్యాధిని మోడలింగ్ చేసే బృందంలో భాగమైన మిచిగాన్ విశ్వవిద్యాలయంలో బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ గా ఉన్న భ్రమర్ ముఖర్జీ అన్నారు. రాబోయే రెండు నెలల్లో భారత్ లో పరిస్థితులు  చాలా కష్టతరమయ్యే అవకాశం ఉందని  తాను భావిస్తున్నట్లు ముఖర్జీ తెలిపారు. 

కోవిడ్-19  వ్యాప్తి యొక్క ప్రారంభ దశలో, మార్చి చివరి వారంలో భారత్  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసింది. ఈ చర్యలు వైరస్  ప్రసారాన్ని కొంతవరకు మందగించినప్పటికీ, ఇతర, అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నట్లుగా ఆ చర్యలు  భారతదేశం యొక్క సంక్రమణ వక్రతను చదును చేయలేదు.

వాస్తవానికి, లాక్ డౌన్  నాలుగు దశాబ్దాలలో మొదటిసారి  భారతదేశాన్ని పూర్తి సంవత్సర ఆర్థిక సంకోచం వైపుకు నెట్టింది. లక్షలాది మంది నిరుద్యోగులను లాక్ డౌన్ మిగిల్చింది. కాగా,కరోనా వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోవాలని మన  దేశ నాయకులు ఇప్పటికే  పౌరులకు సూచించిన విషయం తెలిసిందే. 

మరోవైపు,గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,667 కేసులు నమోదవగా..ప్రస్తుతం  దేశంలో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 3,43,091కి చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,80,013మంది కోలుకోగా మరో 1,53,178మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.5శాతంగా ఉంది. దేశంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 9900కి చేరింది.