AAP కొత్త నినాదం : అచ్చే బీతే 5 సాల్..లగే రహో కేజ్రీవాల్ 

  • Published By: madhu ,Published On : December 20, 2019 / 07:24 AM IST
AAP కొత్త నినాదం : అచ్చే బీతే 5 సాల్..లగే రహో కేజ్రీవాల్ 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను ఖరారు చేస్తోంది. 2020 సంవత్సరంలో ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పాచికలను పారనీయకుండా చేయాలని ఆప్ నేతలు ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగా ప్రజలను ఆకర్షించే పథకాలను ఇప్పటికే తీసుకొచ్చిన ఆప్..తాజాగా కొత్త నినాదం ఎత్తుకుంది.

ప్రజల మెదల్లోకి సులువుగా వెళ్లే విధంగా స్లోగన్ తయారు చేసింది. ‘అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్’..అంటూ కొత్త స్లోగన్‌తో ప్రచారం నిర్వహించాలని ఆప్ నిర్ణయించింది. అంటే ఐదు సంవత్సరాలు మంచిగా గడిచిపోయాయి..కేజ్రీవాల్‌‌ జిందాబాద్ అనే అర్థం వస్తుంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్..ఆప్ జతకట్టింది. వచ్చే ఎన్నికలు పార్టీలకు పరీక్షగా మారిపోయాయి. I-PAC కమిటీ పార్టీలకు పని చేసింది. ఎన్నికల వ్యూహాలు రచించడంలో సక్సెస్ అయ్యింది.

2014లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ కమిటీ ఎంతగానో కృషి చేసింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిశోర్ కీలక రోల్ పోషించారు. రెండేళ్ల పాటు జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పనిచేసినా ఆయన పన్నిన వ్యూహాలు సక్సెస్ కాలేదు. జన్ లోక్ పాల్ బిల్లు కోసం ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హాజారే…కలిసి ఉద్యమించారు  అరవింద్ కేజ్రీవాల్. 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పేరిట పార్టీని స్థాపించారు.

తొలిసారి ముఖ్యమంత్రిగా 49 రోజుల పాటు పదవిలో కొనసాగారు కేజ్రీ. జనలోక్ పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. తర్వాత  2015 ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయదుంధుబి మ్రోగించింది. రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కానీ..MCD ఎన్నికల్లో మాత్రం ఆప్‌కు ఎదురు దెబ్బలు తగిలాయి. తిరిగి మరోసారి అధికారాన్ని దక్కించుకొనేందుకు కేజ్రీవాల్ సన్నద్దమౌతున్నారు. మరి కొత్త నినాదం, ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి. 
Read More : సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు : కొత్త కొత్తగా రేషన్ కార్డులు