ఎందరో త్యాగాలు తర్వాత కోట్లాది భక్తుల కల నెరవేరింది: మోహన్ భగవత్

  • Edited By: vamsi , August 5, 2020 / 02:23 PM IST
ఎందరో త్యాగాలు తర్వాత కోట్లాది భక్తుల కల నెరవేరింది: మోహన్ భగవత్

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ పూర్తయింది. భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన పూజలు నిర్వహించారు. ఈ చారిత్రక కార్యక్రమంలో 175 మంది విశిష్ట అతిథులు పాల్గొన్నారు. రామాలయానికి మోడీ పునాదిరాయి వేయడంతో నిర్మాణ పనులు ప్రారంభం అవగా.. కొన్నేళ్లుగా కోట్లాది మంది రామ్ భక్తుల నిరీక్షణ ముగిసింది.ఈ కార్యక్రమంలో వేదికపై మోడీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యుపీ సిఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్ సహా ఐదుగురు మాత్రమే ఉన్నారు.

ఈ సంధర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. “ఈ రోజు నుంచి రామ్ ఆలయ నిర్మాణం ప్రారంభమైందని, ఈ ఆలయం పూర్తయ్యేలోపు మన మనస్సు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం చాలా మంది త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కృషి కారణంగా, ఈ రోజు అందరి కల నెరవేరింది” అని ఆయన అన్నారు.ఇవాళ దేశమంతా సంతోషకరమైన వాతావరణం ఉందని, ఈ ఆనందం కోసం ప్రజల పోరాటం మర్చిపోలేము అని ఆయన అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పోరాటం చేసిన మా సంకల్పానికి ఫలితం దక్కింది అని ఆయన అన్నారు. 30 ఏళ్ల నాటి సంకల్పం నేడు సాకారం కావడం ఆనందదాయకం అన్నారు. రా

ఆత్మనిర్భర్‌ భారత్‌ అయ్యేందుకు ఇది ఆత్మవిశ్వాసం నింపుతుందని అన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రామాలయం కోసం పాటుపడిన ప్రముఖులు రాలేకపోయారని, ఎల్‌కే అద్వానీ తమ ఇంట్లో నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని అన్నారు. చారిత్రిక ఘట్టంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.