ఈ వీడియో చూస్తే.. జన్మలో రైల్వే స్టేషన్‌లో లెమన్ జ్యూస్ తాగరు

డబ్బు ఆశతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అపరిశుభ్రమైన వాతావారణంలో గలీజ్ పనులు చేస్తున్నారు. ప్రజలను

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 06:58 AM IST
ఈ వీడియో చూస్తే.. జన్మలో రైల్వే స్టేషన్‌లో లెమన్ జ్యూస్ తాగరు

డబ్బు ఆశతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అపరిశుభ్రమైన వాతావారణంలో గలీజ్ పనులు చేస్తున్నారు. ప్రజలను

డబ్బు ఆశతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అపరిశుభ్రమైన వాతావారణంలో గలీజ్ పనులు చేస్తున్నారు. ప్రజలను రోగాల బారిన పడేలా చేస్తున్నారు.  ఇలాంటి ఘోరాన్ని కళ్లకు కట్టే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూశాక జీవితంలో రైల్వే స్టేషన్ లో లెమన్ జ్యూస్ తాగే సాహసం చెయ్యరేమో.

ఓ చిరు వ్యాపారి చేసిన గలీజ్ పనిని కొందరు ప్రయాణికులు సీక్రెట్ గా వీడియో తీశారు. ఆ వ్యక్తి.. చేతులు శుభ్రం చేసుకోకుండానే.. ఓ బకెట్ లో నిమ్మకాయలను పిండాడు. ఆ తర్వాత ఆ రసాన్ని నీళ్లున్న మరో  బకెట్ లోకి పోశాడు. ఆపై చేతులు కడుకున్నాడు. ఆ నీళ్లనే నిమ్మరసం ఉన్న బకెట్ లోకి పోశాడు. ఆ పక్కనే ట్యాంక్ లో నింపిన నీటిని నిమ్మరసం ఉన్న డబ్బాలో కలిపాడు. మ్యాటర్ ఏంటంటే.. అతడు చేతులు  కడుక్కున్న నీళ్లనే నిమ్మరసంలోకి కలిపాడు. శుభ్రం చెయ్యని ట్యాంక్ నుంచి నీటిని తీసుకున్నాడు. ఇలా అన్ని రకాలుగా గలీజ్ పనులు చేశాడు. అదే నిమ్మరసాన్ని తీసుకొచ్చి జనాలకు అమ్మేస్తున్నాడు. ఈ  విషయం తెలియని ప్రయాణికులు లెమన్ జ్యూస్ అనుకుని తాగేస్తున్నారు.

అసలే ఎండాకాలం. తీవ్రమైన ఎండలతో గొంతు ఎండిపోతోంది. దాహంతో అలమటిస్తున్నారు. ఈ సమయంలో చల్లగా ఏదైనా తాగి సేద తీరాలని చూస్తారు. రైల్వే స్టేషన్లకు వచ్చే వారు చాలామంది లెమన్  జ్యూస్ తాగేందుకు ఇష్టపడతారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో.. వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అపరిశుభ్ర వాతావారణంలో అపరిశుభ్రమైన నీటిని వాడి ప్రజల ఆరోగ్యాలతో  చెలగాటమాడుతున్నారు. అసలు విషయం తెలియక.. జనాలు ఆ జ్యూస్ తాగేసి ఆస్పత్రి పాలు అవుతున్నారు.

రైల్వే స్టేషన్ లో కొందరు వ్యక్తులు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. మరీ ఇంత నీచమా అని నిర్ఘాంతపోతున్నారు. ఇక జన్మలో రైల్వే స్టేషన్ లో లెమన్ జ్యూస్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.