Amazon Layoff: ఇండియాలోనూ ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. ఎంతమందో తెలుసా?

దేశంలోనే అతిపెద్ద ఈ- కామర్స్ కంపెనీ అమెజాన్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 18వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అయితే, భారత్‌లో ఎంతమంది ఉద్యోగుల ఉద్యోగాలు ఊడతాయనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో దాదాపు లక్ష మంది ఉద్యోగులు అమెజాన్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో 1శాతం మంది ఉద్యోగులకు అమెజాన్ ఉద్వాసన పలుకుతుందని తెలుస్తుంది.

Amazon Layoff: ఇండియాలోనూ ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. ఎంతమందో తెలుసా?

Amazon india

Amazon Layoff: దేశంలోనే అతిపెద్ద ఈ- కామర్స్ కంపెనీ అమెజాన్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈనెల చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 18వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఇప్పటికే ఆ సంస్థ సీఈవో ఆండీ జాస్సీ స్పష్టం చేశారు. కంపెనీ ఆర్థిక పరిస్థితుల కారణంగా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఆయన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పంపించిన మెయిల్ ద్వారా ఇటీవల వెల్లడించారు. జనవరి 17 తరువాత ఉద్యోగాల నుంచి తొలగించే వారి పేర్లను వెల్లడిస్తామని, ఆ తరువాత వారి సేవలను రద్దు చేయడం జరుగుతుందని ఆండీ జాస్సీ స్పష్టం చేశారు.

Amazon CEO Andy Jassy: అమెజాన్‌లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ 2023లో కూడా కొనసాగుతుంది..

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇప్పటికే ట్విటర్ సగం మంది ఉద్యోగులను తొలగించగా, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నాయి. గతంలో అమెజాన్ సైతం సంస్థలోని పదివేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా మరోసారి 18వేల మందిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉద్వాసన పలికే ఉద్యోగుల లిస్ట్ సైతం రెడీ అయినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Amazon Employees: అమెజాన్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 18వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

అమెజాన్ తొలగించే 18వేల మంది ఉద్యోగుల్లో భారత్‌లో ఎంతమంది ఉంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో దాదాపు లక్ష మంది ఉద్యోగులు అమెజాన్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో 1శాతం మంది ఉద్యోగులకు అంటే వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు అమెజాన్ యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువగా అమెజాన్ స్టోర్, పీఎక్స్‌టీ (పీపుల్, ఎక్స్ పీరియన్స్ అండ్ టెక్నాలజీ) సంస్థలకు సంబంధించి విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తామని సీఈఓ ఇప్పటికే స్పష్టం చేశారు. భారత్‌లోనూ ఈ విభాగాల్లో పనిచేసే అధికశాతం మంది ఉద్యోగులపైనే వేటు పడుతుందని సమాచారం.