ఆధారాలు బయటపెట్టిన IAF : పాక్ F-16 కూల్చివేశాం

పాక్ చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని మిగ్‌ 21తోనే కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి స్పష్టం చేసింది.

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2019 / 01:26 PM IST
ఆధారాలు బయటపెట్టిన IAF : పాక్ F-16 కూల్చివేశాం

పాక్ చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని మిగ్‌ 21తోనే కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి స్పష్టం చేసింది.

పాక్ చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని మిగ్‌ 21తోనే కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన రాడార్‌ ఇమేజ్ లను సోమవారం(ఏప్రిల్-8,2019) ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు రిలీజ్ చేశారు. అయితే సెక్యూరిటీ,కాన్ఫిడెన్షియల్ కన్సర్న్స్ దృష్ట్యా వాటిని పబ్లిక్ డొమైన్ లోకి షేర్ చేయడంలేదని IAF తెలిపింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన డాగ్‌ ఫైట్‌లో…యూఎస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎఫ్‌-16 విమానాన్ని కూల్చామని, దానికి కావాల్సిన అన్నీ ఆధారాలు అన్నీ పక్కాగా ఉన్నాయని ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్‌ తెలిపారు. 
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర

పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎఫ్‌-16 యుద్ధ విమానాల సంఖ్య తగ్గలేదని రెండు రోజుల క్రితం అమెరికా ఫారిన్‌ పాలసీ పత్రిక ఓ రిపోర్ట్‌ ను రిలీజ్ చేసింది. దీంతో ఎఫ్‌16 కూల్చివేతపై అస్పష్టత ఏర్పడింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన డాగ్‌ ఫైట్‌ తర్వాత.. భారత అధికారులు ఆమ్రమ్‌ మిస్సైల్‌ శిథిలాన్ని గుర్తించారు. ఆ రోజు జరిగిన ఫైట్‌ లో రెండు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు నేలకూలాయని IAF అధికారి చెప్పారు. దాంట్లో ఐఏఎఫ్‌కు చెందిన మిగ్‌ విమానంతో పాటు ఎఫ్‌-16 ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అయితే పాక్‌ వాడిన ఎఫ్‌16 విమానానికి చెందిన ఎలక్ట్రానిక్‌ సిగ్నేచర్‌ తో పాటు రేడియో ట్రాన్స్‌స్క్రిప్ట్స్‌ ఉన్నాయని అధికారులు తెలిపారు.

Read Also : Paytm మాల్ ప్లాన్ : 300 మంది ఉద్యోగులు కావాలి