Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు

ఉత్తరాఖండ్ లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం పితోరగఢ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.

Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు

earthquake

Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్ లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం పితోరగఢ్ లో భూమి కంపించింది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఇవాళ ఉదయం 8.58 గంటలకు సముద్రమట్టానికి 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.

29.78 అక్షాంశం, 80.13 రేఖాంశంలో భూకంపం సంభవించింది. పితోరగఢ్ కు భూకంప కేంద్రం ఉత్తర వాయువ్యంగా 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదివారం ఉదయం 8.58 గంటలకు ఉత్తరాఖండ్ లోని ఫితోరగఢ్ లో భూమి కంపించిందని నేషనల్ సెంట్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది.

Earthquake In Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.2గా నమోదు

రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైందని తెలిపింది. సముద్ర మట్టానికి 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని ట్వీట్ చేసింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు.