Amruta Fadnavis: రూ.10కోట్లు ఇవ్వకుంటే నీ వీడియోలు వైరల్ చేస్తా.. అమృతా ఫడణవీస్‌ను బ్లాక్ మెయిల్ చేసిన డిజైనర్ ..

నాకు రూ. 10కోట్లు ఇవ్వాలి, లేదంటే నీ వీడియోలను వైరల్ చేస్తా అంటూ ఓ డిజైనర్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతాను బ్లాక్‌మెయిల్ చేసింది. అమృతా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డిజైనర్ అనిక్ష జైసింఘానీని అరెస్టు చేశారు.

Amruta Fadnavis: రూ.10కోట్లు ఇవ్వకుంటే నీ వీడియోలు వైరల్ చేస్తా.. అమృతా ఫడణవీస్‌ను బ్లాక్ మెయిల్ చేసిన డిజైనర్ ..

Amruta Fadnavis

Amruta Fadnavis: నాకు రూ. 10కోట్లు ఇవ్వాలి, లేదంటే నీ వీడియోలను వైరల్ చేస్తా అంటూ ఓ డిజైనర్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతాను బ్లాక్‌మెయిల్ చేసింది. అమృతా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డిజైనర్ అనిక్ష జైసింఘానీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఆమెకు మార్చి 21 వరకు పోలీసు కస్టడీ విధించింది. అమృతా ఫడణవీస్‌కు గత 16నెలలుగా డిజైనర్ అనిక్ష జైసింఘానీతో పరిచయముంది. తన తండ్రి అనిల్ జైసింఘానీపై పలు కేసులు ఉండటంతో వాటినుంచి బయటపడేయాలని కోరుతూ అమృతాకు రూ. కోటి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే, అందుకు ఒప్పుకోని అమృతా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Amruta Fadnavis: డిజైనర్‌పై అమృత ఫడ్నవిస్ కేసు.. కోటి లంచం ఇవ్వాలనుకుందంటూ ఫిర్యాదు

అమృతా ఫడణవీస్ ఫిర్యాదుతో అనిక్ష, ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అమృతపై కక్షపెంచుకున్న అనిక్ష రెండు రోజుల తరువాత అమృత ఫోన్‌కు రెండు వీడియోలు పంపించింది. ఆ వీడియోల్లో అమృతా కోటిరూపాయలు తీసుకుంటున్నట్లుగా ఉంది. తనకు రూ. 10కోట్లు ఇవ్వాలని, అంతేకాక తన తండ్రిపై కేసులు తొలగించేలా చూడాలని, లేకుంటే ఈ వీడియోలను వైరల్ చేస్తానంటూ అనిక్ష బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో అమృతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బ్లాక్ మెయిల్, బెదిరింపుల కేసు నమోదు చేసి అనిక్షను అదుపులోకి తీసుకున్నారు.

Amruta Fadnavis: దేశానికి ఇద్దరు జాతి పితలు. ఒకరు మోదీ, మరొకరు.. అమృత ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆమె వద్ద ఉన్న వీడియోలను పరిశీలించగా.. అవి మార్ఫింగ్ వీడియోలుగా తేలింది. దీంతో ఆ వీడియోలను క్రియేట్ చేసిన నిందితులకోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డిజైనర్ అనిక్ష తండ్రి అనిల్ జైసింఘానీ పేరుమోసిన అంతర్జాతీయ క్రికెట్ బుకీ అని తెలిసింది. ఆయనపై పలు కేసులు ఉన్నాయి.