Anjali Appadurai: కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ముఖ్యమంత్రి పదవికి పోటీలో తమిళనాడు యువతి

విదేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కీలక భూమిక పోషిస్తున్నారు. అత్యున్నత స్థాయి పదవులకు పోటీదారులుగా నిలుస్తున్నారు. తాజాగా కెనడా దేశంలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ ముఖ్యమంత్రి పదవికి జరిగే ఎన్నికల్లో తమిళనాడు మధురైకు చెందిన అంజలి అప్పాదురై పోటీ పడుతున్నారు.

Anjali Appadurai: కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ముఖ్యమంత్రి పదవికి పోటీలో తమిళనాడు యువతి

Anjali Appadurai

Anjali Appadurai: విదేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కీలక భూమిక పోషిస్తున్నారు. అత్యున్నత స్థాయి పదవులకు పోటీదారులుగా నిలుస్తున్నారు. బ్రిటన్ ప్రధాని పీఠం బరిలో భారత సంతతికి చెందిన రిషి సునక్ బరిలో ఉన్నారు. తాజాగా కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ముఖ్యమంత్రి పదవికి తమిళనాడుకు చెందిన అంజలి అప్పాదురై పోటీ చేస్తున్నారు. ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న కెనడాలో 10 ప్రావిన్సులు ఉన్నాయి. ఒక్కో ప్రావిన్స్ కు వేర్వేరుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

Starbucks CEO: స్టార్‌బక్స్ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్.. భారత సంతతి వ్యక్తికి మరో అంతర్జాతీయ సంస్థ పగ్గాలు ..

కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. 62ఏళ్ల జాన్ హోర్గాన్ ఆ ప్రావిన్స్‌కు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. క్యాన్సర్ కారణంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించారు. దీంతో పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించనున్నాయి. బ్రిటీష్ కొలంబియా హౌసింగ్ అండ్ జస్టిస్ మంత్రి డేవిడ్ ఏబీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన 32ఏళ్ల యువతి అంజలి అప్పాదురై ఆయనకు పోటీగా బరిలో నిలిచారు. అయితే నవంబర్ 13న పార్టీ అంతర్గత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తారు.

India Vs Pak Match: మరోసారి దాయాది జట్ల మధ్య పోరు.. సూపర్-4లో తలపడనున్న భారత్ – పాక్ జట్లు.. ఎప్పుడంటే?

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అంజలి అప్పాదురై తమిళనాడులోని మధురైలో 1990లో జన్మించారు. ఆమె ఆరు సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులు కెనడాకు వలస వెళ్లారు. ఆమె కుటుంబం బ్రిటిష్ కొలంబియాలోని కుక్‌విచ్‌లో నివాసముంటుంది. చిన్నతనం నుండి విద్యలో ప్రతిభ కనబర్చిన అంజలి ప్రభుత్వ స్కాలర్ షిప్‌ను అందుకుంది. బార్‌భార్బర్, మైనేలోని అట్లాంటిక్ కళాశాల నుండి అంతర్జాతీయ రాజకీయాలు, వాతావరణ విధానాలలో ప్రధానమైనదిగా పట్టభద్రురాలైంది. అంజలి రాజకీయ నేతగా మాత్రమే కాకుండా సామాజిక సేవకురాలిగా కూడా గుర్తింపు పొందారు.