Anokha mall : ఈ ‘మాల్’‌లో అన్నీ ఫ్రీ…ఎవరికి నచ్చినవి వారు ‘ఉచితం’గా తీసుకెళ్లొచ్చు..

షాపింగ్‌ మాల్‌ కు వెళితే డబ్బులు పెట్టి వస్తువులు కొనుకెళతాం. కానీ ఓ ‘మాల్’కు వెళితే మాత్రం అన్నీ ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఎవరికి నచ్చినవి వారు ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా తీసుకెళ్లొచ్చు.

Anokha mall : ఈ ‘మాల్’‌లో అన్నీ ఫ్రీ…ఎవరికి నచ్చినవి వారు ‘ఉచితం’గా తీసుకెళ్లొచ్చు..

Anokha Mall in Lucknow

Anokha Mall in Lucknow : షాపింగ్‌ మాల్‌ కు వెళితే డబ్బులు పెట్టి వస్తువులు కొనుకెళతాం. కానీ ఓ ‘మాల్’కు వెళితే మాత్రం అన్నీ ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఎవరికి నచ్చినవి వారు ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఈ మాల్ నిరుపేదల కోసం నిర్మించినది. ఇక్కడకు వచ్చి దుప్పట్లు, స్వెట్టర్లు, చెప్పులు, సూట్‌కేసులు ఇలా ఎవరికి నచ్చినవి వారు ఎవ్వరిని అడకుండా ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా తీసుకెళ్లొచ్చు. అదే ‘ అనోఖా మాల్’.

మద్యప్రదేశ్ రాజధాని రహీంనగర్‌లో ఉన్న అనోఖా మాల్‌లో పేదలకు అవసరమైన దుస్తులే ఉంటాయి. వారికి అవసరమైనవి చక్కగా ఎటువంటి సంకోచం లేకుండా..ఎవరినీ చేయిచాచి అడగకుండా తమకు నచ్చిన వాటిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. చలికాలంలో పేదలు, కార్మికులు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన డాక్టర్ అహ్మద్‌ రజాఖాన్‌ ఈ మాల్ ను ఏర్పాటు చేశారు. అహ్మద్ ఆవేదనలోంచి ఐదేళ్ల క్రితం పుట్టిన ఆలోచనే అనోఖా మాల్ ఏర్పాటు‌.

ఈ మాల్‌లో పలువురు దాతలు అందించిన స్వెటర్లు, బ్లాంకెట్లు, దుప్పట్లు,చెప్పులు, సూట్‌కేసులతో పాటు మెత్తటి బొంతలు, పరుపులతో పాటు పలు వస్తువులు ఉంటాయి. పేదలకు అవసరమైనవి ఈ మాల్ కు వచ్చి తీసుకెళ్లొచ్చు. సాయం కోసం ఎవ్వరి ముందు చేయి చాచకుండా ఇక్కడుండేవాటిని ఉచితంగా తీసుకెళ్లొచ్చని అదే ఈ ‘అనోఖా మాల్’ ప్రత్యేకత అని తెలిపారు డాక్టర్ అహ్మద్‌ అలీఖాన్.

ఈ మాల్ ఏర్పాటు వెనుక డాక్టర్ అహ్మద్ కృషి ఎంతో ప్రశంసనీయమైనది. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టటానికి దాతల నుంచి స్పందన రావటానికి చాలా కష్టపడ్డారు. తన ఆలోచనను పలువురితో పంచుకుని వారిని ఒప్పించి ఇలా మాల్ కు దానం చేయటానికి డాక్టర్ కృషి ఎంతో అభినందనీయమని దాతలు చెబుతుంటారు. ఈ మాల్ కోసం డాక్టర్ ఎంతో ప్రచారంచేసిన మీదట దాతల నుంచి మంచి స్పందన రావటంతో ఇప్పుడు అనోఖా మాల్ పేదల పాలిట వరంగా మారింది అని పలువురు దాతలు చెబుతుంటారు.