Army MIG-21 Crash: రాజస్థాన్‌లో ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. పైలట్ సేఫ్.. ముగ్గురు మృతి

భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ సమీపంలో బహ్లోల్‌నగర్‌లో ఓ ఇంటిపై కుప్పకూలింది.

Army MIG-21 Crash: రాజస్థాన్‌లో ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. పైలట్ సేఫ్.. ముగ్గురు మృతి

Army MIG-21 Crash

Army MIG-21 Crash: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం సోమవారం రాజస్థాన్‌లో కూలింది. హనుమాన్‌ఘర్ సమీపంలో బహ్లోల్‌నగర్‌లో ఓ ఇంటిపై మిగ్ -21 కుప్పకూలింది. కూలడానికి ముందే అప్రమత్తమైన పైలట్ విమానం నుంచి ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకాడు. దీంతో అతను స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తికూడా మృతి చెందాడు. సూరత్‌గఢ్‌ నుంచి మిగ్- 21 యుద్ధ విమానం బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Army Helicopter Crash: జమ్మూ కాశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ..

ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో పైలట్‌కు గాయాలయ్యాయని, పైలట్ కోసం వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 పంపటంతో అతన్ని చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు. ఇంటిపై మిగ్ -21 కూలడంతో ఆ సమయంలో అక్కడ ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతిచెందారు.  వ్యక్తికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆ వ్యక్తి మరణించినట్లు చెప్పారు. మృతులు ముగ్గురు వేరువేరు కుటుంబాల వారు. మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు.  ఇదిలాఉంటే మిగ్ 21 యుద్ధ విమానం కూలడంపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది. సూరత్‌గఢ్ సమీపంలో సాధారణ శిక్షణ సమయంలో ఈ యుద్ధ విమానం కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.

Kerala Boat Incident: కేరళ బోటు ప్రమాద ఘటనలో 22కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇటీవల కాలంలో వరుసగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా.. మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది. ఏప్రిల్ నెలలో శిక్షణ సమయంలో కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ క్రాస్ ల్యాండింగ్ చేయడంతో కొచ్చిలో ప్రమాదం జరిగింది. గతవారం జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది.