ED Raids: ఈడీ కస్టడీలో లక్ష కోట్ల ఆస్తులు.. సీజ్ చేసిన డబ్బు, నగలు ఏం చేస్తుందో తెలుసా?

వరుసగా దాడులు చేస్తోన్న ఈడీ దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల నగదును, నగల్ని స్వాధీనం చేసుకుంటోంది. మరి ఆ డబ్బు, నగలు, ఆస్తిని ఈడీ ఏం చేస్తుందో తెలుసా?

ED Raids: ఈడీ కస్టడీలో లక్ష కోట్ల ఆస్తులు.. సీజ్ చేసిన డబ్బు, నగలు ఏం చేస్తుందో తెలుసా?

ED Raids: ఇటీవలి కాలంలో వరుస దాడులు, విచారణలతో దేశవ్యాప్తంగా సంచలనంగా నిలుస్తోంది ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్). మనీ లాండరింగ్, అవినీతి, ఆర్థిక నేరాలు, పన్ను ఎగవేత వంటి వాటిని విచారిస్తుంది ఈ సంస్థ.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

ఈ విచారణలో భాగంగా నిందితుల దగ్గర అక్రమంగా ఉన్న డబ్బు, నగలు, ఇతర ఖరీదైన వస్తువులు, ఆస్తితోపాటు కొన్నిసార్లు బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేస్తుంది. డబ్బు, నగలు, వస్తువుల్ని ఈడీ తన కార్యాలయానికి తీసుకెళ్తుంది. సాధారణంగా ఈడీ నిత్యం కోట్లాది రూపాయల నగదు, నగల్నే స్వాధీనం చేసుకుంటుంది. మరి ఆ డబ్బంతా ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఈ విషయంలో ఆ సంస్థ చట్టాన్ని అనుసరిస్తుంది. ఈడీతోపాటు సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకున్న డబ్బు, నగల్ని తమ కార్యాలయాలకు తరలిస్తారు. తర్వాత వీటి లెక్కలు తేల్చి, పంచనామా పూర్తైన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఆర్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వాటిలో ఉన్న ఈడీ అకౌంట్లలో జమ చేస్తారు.

Rajath Kumar IAS: ఐఏఎస్ రతజ్ కుమార్‌పై అవినీతి ఆరోపణల కేసు.. డీవోపీటీపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

నగలు, ఇతర వస్తువుల్ని సీల్డ్ కవర్లో భద్రంగా దాచి కోర్టులో ఆధారాలుగా ప్రవేశపెడతారు. తర్వాత కోర్టు నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. అంటే కోర్టులో దోషి నేరానికి పాల్పడ్డట్లు తేలితే, డబ్బుల్ని, నగల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారు. లేదంటే తిరిగి ఇచ్చేస్తారు. ఒకవేళ బ్యాంకులో అవకతవకలకు పాల్పడితే నిందితుల ఆస్తులు, నగలు, వస్తువులు, బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేస్తారు. వీటిలో నేరం రుజువైతే ఏ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారో వాటికి అప్పగిస్తారు. తర్వాత ఆస్తుల్ని నిబంధనల ప్రకారం వేలం వేయడమో, నేరుగా విక్రయించడమో చేస్తుంటారు. దీని ద్వారా బ్యాంకులకు ఆ నష్టాలు వీలున్నంత భర్తీ అవుతాయి. ఇప్పటివరకు ఈ పద్ధతి ద్వారా రూ.23,000 కోట్లను బ్యాంకులకు తిరిగి చెల్లించారు.

Mobile Torches: కరెంటు లేక మొబైల్ టార్చ్‌తో రోగులకు చికిత్స.. వైరల్‌గా మారిన వీడియో

నిబంధనలేం చెబుతున్నాయి
ప్రస్తుత నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఏదైనా ఆస్తి, నగదు వంటివి అక్రమమే అని 180 రోజుల్లో నిరూపించాలి. అంతకంటే ఎక్కువ రోజులు తమ స్వాధీనంలో ఉంచుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఈ లోపు నేరాన్ని నిరూపించలేకపోతే, తిరిగి సొంతదారులకు వాటిని అందించాల్సి ఉంటుంది. ఒకవేళ నేరం నిరూపణ అయితే, తిరిగి 45 రోజుల్లోపు నిందితుడు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఈడీ స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తులు విలువ రూ.1 లక్ష కోట్ల వరకు ఉంటుందని అంచనా. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఈడీ దాడులు అధికంగా పెరిగాయి. 2004-2014 వరకు పదేళ్ల కాలంలో 112 ఈడీ దాడులు జరిగితే, 2014-2022 వరకు ఈ దాడులు 27 రెట్లు పెరిగి, 3,010కి చేరాయి.