Retired Karnataka Teacher : వయస్సు 73..వరుడు కావలెను, రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలి కథ

వయస్సు 73 సంవత్సరాలు. తనకు వరుడు కావలెను అంటూ ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Retired Karnataka Teacher : వయస్సు 73..వరుడు కావలెను, రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలి కథ

Karnataka Teacher

Life Partner : వయస్సు 73 సంవత్సరాలు. తనకు వరుడు కావలెను అంటూ ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కర్నాటక రాష్ట్రంలోని 73 ఏళ్ల రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఈ ప్రకటనను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె ధైర్యానికి, పాజిటివ్ ఆలోచనను మెచ్చుకున్నారు. ఈ ప్రకటన వెనుకున్న అంతర్లీన సమస్యపై మాత్రం ఎవరూ అంతగా ఫోకస్ పెట్టలేదు. ఇంజనీర్ గా పదవీ విరమణ చేసిన 69 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు తోడుగా ఉంటాననే స్పందన రావడం గమనార్హం.

ఒంటరి జీవితం :-
తనది సంప్రదాయ కుటుంబమని, ఆరోగ్యంగా ఉన్న 70 ఏళ్ల పైబడిన వ్యక్తితో జీవితం పంచుకోవడానికి చూస్తున్నట్లు ఆ రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు వెల్లడించింది. తనకు సొంత కుటుంబం లేదని, తల్లిదండ్రులు చనిపోయినట్లు, మొదటి వివాహం, విడాకులు కావడంతో చాలా బాధ పడినట్లు..ఈ కారణంగానే..తిరిగి వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదని తెలిపారు. ఇప్పుడు ఒంటరి జీవితం తనను భయపెడుతోందని, ఎవరి సాయం లేకుండా..బస్టాప్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి బయటకు నడవడానికి..ఇంట్లో ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నట్లు..అందుకే జీవిత భాగస్వామి కోసం చూస్తున్నానని తెలిపింది.

యువత నుంచి ప్రశంసలు : –
ఒంటరి జీవితానికి ఏ వయస్సులోనైనా తోడు అవసరం అనే విషయం అంతగా పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టు విపరీతంగా ట్రోల్ అయ్యింది. ప్రత్యేకించి యువత నుంచి విపరీతంగా ప్రశంసలు అందాయి. మహిళలు అనే కాదు..మగవారు కూడా ఒంటరితనం పట్ల భయపడుతుంటతారని, భాగస్వామి కోసం ఎంచుకొనే స్వతంత్రం మగవారికే అధికంగా ఉంటుందని సామాజిక కార్యకర్తలు వెల్లడించారు. దీనినే ఇప్పటి వరకు సమాజం ఆమోదిస్తూ..వచ్చిందని, ఇలాంటి ధోరణికి ఈ ప్రకటన ఓ సమాధానం అవుతుందన్నారు. మూస పితృస్వామ్య ఆలోచనకు, యవ్వనంగా ఉన్నప్పుడే వివాహం చేసుకొంటారనే ఆలోచనలకు ఈ ప్రకటన ఒక అడ్డంకిని తొలగిస్తుందని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు.

Read More : Naresh filed a complaint : 10 కోట్లు మోసం… న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్