ఆన్‌లైన్ క్లాసులు.. అవరోధాలు.. 27% మంది సమస్య ఇదే: NCERT సర్వే

  • Published By: vamsi ,Published On : August 21, 2020 / 06:50 AM IST
ఆన్‌లైన్ క్లాసులు.. అవరోధాలు..  27% మంది సమస్య ఇదే: NCERT సర్వే

కరోనా కారణంగా చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మరియు ఆన్‌లైన్ లెర్నింగ్‌పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వే ప్రకారం, 27 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల్లో క్లాసులు వినడానికి అవసరమైన స్మార్ట్‌ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లు లేవు. అదే సమయంలో, ఆన్‌లైన్ బోధన-అభ్యాసంలో విద్యుత్తు అంతరాయం ప్రధాన అవరోధంగా ఉంది అని 28 శాతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.



విద్యా ప్రయోజనాల కోసం మరియు ఉపాధ్యాయుల కోసం స్మార్ట్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్ పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించడం గురించి ఇంకా అజ్ఞానం ఉందని కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు మరియు సిబిఎస్‌ఈ అనుబంధ పాఠశాలల NCERT సర్వేలో తెలిపారు. 34వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ మేరకు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.



సర్వే ప్రకారం కోవిడ్ -19 మహమ్మారి సమయంలో బోధన-అభ్యాసం కోసం మొబైల్ ఫోన్‌లను ఎంచుకున్నారని చెప్పారు. అదే సమయంలో, ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులలో ల్యాప్‌టాప్ రెండవ ఇష్టమైన పరికరం. అంటువ్యాధి సమయంలో టెలివిజన్ మరియు రేడియోలను బోధన-అభ్యాసం కోసం తక్కువగా ఉపయోగిస్తున్నారు.



ఇక సర్వేలో వెలుగుజూసిన మరో ప్రధాన విషయం ఏమిటంటే, ఈ-టెక్స్ బుక్స్.. NCERT వెబ్‌సైట్ మరియు వివిధ తరగతుల ఇనిషియేషన్ పోర్టల్ ఆన్‌లైన్‌లో ఉచిత డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉన్నప్పటికీ, సర్వేలో పాల్గొన్న సగం మంది విద్యార్థులు దగ్గర పాఠశాల పాఠ్య పుస్తకాలు లేవు. సర్వే ప్రకారం, విద్యార్థులకు టెక్స్-బుక్స్ ద్వారా చదివే అలవాటు ఉండడం మరియు ఈ-టెక్స్ట్ బుక్స్ వాడకం గురించి పెద్దగా సమాచారం లేకపోవడమే దీనికి కారణం.



సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఆన్‌లైన్ మార్గాల ద్వారా గణితాన్ని బోధించడం-నేర్చుకోవడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.