అక్టోబర్ 18 డెడ్ లైన్ : అయోధ్య కేసులో వాదనలకు సుప్రీంకోర్టు గడువు

అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాదనలకు గడువు విధించారు. నెల రోజుల్లో అంటే అక్టోబర్ 18తో వాదనలు

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 07:02 AM IST
అక్టోబర్ 18 డెడ్ లైన్ : అయోధ్య కేసులో వాదనలకు సుప్రీంకోర్టు గడువు

అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాదనలకు గడువు విధించారు. నెల రోజుల్లో అంటే అక్టోబర్ 18తో వాదనలు

అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాదనలకు గడువు విధించారు. నెల రోజుల్లో అంటే అక్టోబర్ 18తో వాదనలు ముగించాలన్నారు. అయోధ్య కేసులో అక్టోబర్ 18లోపు విచారణ పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వాదనలు వినిపించాలని లాయర్లకు సూచించారు. 18కల్లా వాదనలు పూర్తవుతాయన్న ఆశాభావాన్ని సీజేఐ వ్యక్తం చేశారు. అదే రోజున కోర్టు ఆదేశాలను రిజర్వ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. నవంబర్ 17తో సీజేఐ పదవీకాలం ముగియనుంది. ఈలోపే అయోధ్య కేసు వివాదంపై తీర్పు వెలువడే అవకాశముందని సమాచారం.

కేసులోని పార్టీలు మధ్యవర్తిత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదని సుప్రీం తెలిపింది. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కమిటీ ప్రయత్నాలు చేయవచ్చని వెల్లడించింది. కమిటీకి పరిష్కారం దొరికినట్లయితే దాన్ని కోర్టు ముందుకు తీసుకురావొచ్చని అభిప్రాయపడింది. ఎప్పటిలాగే మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులను గోప్యంగా కొనసాగించాలని సూచించింది. ఈ కమిటీతో పాటు కోర్టులో విచారణ సాగుతుందని తెలిపింది. అయోధ్య భూవివాదం కేసుపై 26వ రోజూ విచారణ జరిగింది. అయోధ్య కేసు వాదనలు ఎప్పటివరకు ముగిస్తారని రామ్ లల్లా, సున్ని వక్ఫ్ బోర్డు లాయర్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగారు. అక్టోబర్ 18లోపు వాదనలు ముగిస్తామని వారు తెలిపారు.