అయోధ్య కేసులో క్షమాపణ కోరిన ముస్లిం పార్టీలు

అయోధ్య కేసులో క్షమాపణ కోరిన ముస్లిం పార్టీలు

సుప్రీం కోర్టులో నడుస్తోన్న అయోధ్య కేసుపై ముస్లిం పార్టీలు U టర్న్ తీసుకున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సంబంధించిన 2003 రిపోర్టు రాసిన వ్యక్తి గురించి తెలియాలంటూ సుప్రీం కోర్టులో వినిపించిన వాదనలు వెనక్కి తీసుకున్నాయి. ఈ కేసు నిమిత్తం సుప్రీం కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు క్షమాపణ కోరాయి. 

చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల కమిటీకి సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ ఏఎస్ఐ రిపోర్టు గురించి వారు ప్రశ్నించదలచుకోవడం లేదని తేల్చి చెప్పాడు. ‘రచయిత గురించి ప్రతి పేజీలో ఉండాలనుకోవడం అర్థం లేని విషయం. దీని గురించి సుప్రీం కోర్టు సమయాన్ని వృథా చేశామనుకుంటే దానికి క్షమాపణ కోరుతున్నాం’ అని ముస్లిం పార్టీల తరపు న్యాయవాది ధావన్ వెల్లడించారు. 

బుధవారం సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా ముస్లిం పార్టీల తరపున వాదిస్తూ ప్రతి చాప్టర్‌కు రచయిత ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అందులోనూ సారాంశానికి సంబంధించి ఒక్కరు కూడా లేరని ప్రశ్నించారు. ఇదే విషయంపై ఏర్పాటైన బెంచ్ అక్టోబర్ 18నాటికల్లా పూర్తి వాదనలు వినిపించాలని తర్వాత వినేది లేదని ముందే తీర్పునిచ్చింది.