Bengal Election: బెంగాల్ లో మిగతా దశలకు ఒకేసారి పోలింగ్

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజుకు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 8 దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు 4 దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

Bengal Election: బెంగాల్ లో మిగతా దశలకు ఒకేసారి పోలింగ్

Bengal Election

Bengal Election: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజుకు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 8 దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు 4 దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు దశలను ఒకే దశకు కుదించి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ఆ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. ఈసీ నిర్ణయాన్ని తాను గతంలోనే వ్యతిరేకించానని తెలిపారు మమత.. బెంగాల్ తోపాటు జరిగే మిగతా రాష్ట్రాల్లో ఒకటి నుంచి మూడు దశల్లో ఎన్నికలను పూర్తీ చేస్తే బెంగాల్ లో మాత్రం 8 దశలు పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మిగిలిన నాలుగు దశల ఎన్నికలను కుదించి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు మమత. అయితే గత నాలుగు రోజుల నుంచే దీనిపై చర్చ నడుస్తుంది. బీజేపీ నేతల్లోని కొందరు నాలుగు రోజుల క్రితమే కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీకి లేఖ రాస్తే మంచిదని సలహా ఇచ్చారు. మమత కూడా ఒకే దశలో పోలింగ్ జరపాలని కోరడంతో ఎన్నికల కమిషన్ దిగొచ్చే అవకాశం కనిపిస్తుంది.

కాగా శనివారం ఐదవ దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నెల 22, 26, 29 తేదీల్లో ఆరు, ఏడు, ఎనిమిది దశలకు పోలింగ్ జరగనుంది. వీటిని కలిపి ఒకేసారి నిర్వహిస్తారన్న గురువారం ఊహాగానాలు మొదలయ్యాయి. అలాంటి ఆలోచనేమీ లేదని ఈసీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.