వాట్సప్ గ్రూప్ లో బ్లూ ఫిల్మ్స్ ఫొటోస్

  • Published By: madhu ,Published On : August 3, 2020 / 07:21 AM IST
వాట్సప్ గ్రూప్ లో బ్లూ ఫిల్మ్స్ ఫొటోస్

వాట్సప్ గ్రూప్ లో బ్లూ ఫిల్మ్ ఫొటోలు దర్శనం ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అది కూడా ఓ నేత సెల్ నుంచి రావడం హాట్ టాపిక్ అయ్యింది. నాకేం తెలియదు. ఆ సమయంలో…నా సెల్ ఫోన్ చిన్న పిల్లల దగ్గర ఉంది..అని ఆ లీడర్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నన్ను క్షమించండి అని కోరారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.



రవిగౌడ పాటిల్ దూళఖేడ మాజీ కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడు. ఈయన ఫొన్ నుంచి కొన్ని నీలి చిత్రాలు విజయపుర డీసీసీ ప్రెస్ గ్రూప్ లో అప్ లోడ్ అయ్యాయి. గ్రూప్ లో ఉన్న సభ్యులు ఈ ఫొటోలు చూసి నోరెళ్లబెట్టారు. ఇది కరెక్టు కాదని చెప్పారు. దీనికి రవిగౌడ ఎలాంటి సమాధానం చెప్పలేదు. విషయం గ్రూప్ అడ్మిన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వసంత హొనమాడే రెస్పాండ్ అయ్యారు.



వెంటనే రవిగౌడ నుంచి గ్రూప్ నుంచి తొలగించారు. చివరకు రవిగౌడ మీడియతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చెప్పిన సమాధానంతో మరింత ఆశ్చర్యపోయింది మీడియా. తనను క్షమించాలని కోరారు. శనివారం రాత్రి ఇంట్లో ముఖం కడుక్కోవడానికి వెళ్లన సమయంలో..తన సెల్ పిల్లల దగ్గర ఉందని, ఈ సమయంలోనే..ఫోటోలు వెళ్లి ఉండవచ్చునని అన్నారు. అందరూ క్షమించాలని కోరారు. కానీ..చిన్న పిల్లలు అలాంటి ఫొటోలు పోస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.