హిందూ అమ్మాయి-ముస్లిం అబ్బాయి మధ్యలో సుప్రీం కోర్టు

హిందూ అమ్మాయి-ముస్లిం అబ్బాయి మధ్యలో సుప్రీం కోర్టు

హిందూ అమ్మాయి.. ముస్లిం అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి వరకూ వెళ్లే సరికి మతాలపై ఉన్న అనుమానాలు అబ్బాయిని మోసగాడంటూ వెనక్కినెట్టేశాయి. ఒక్కటి అయ్యేందుకు సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన ఆ జంటకు తీపి కబురుచెప్పింది న్యాయస్థానం. మహిళను ప్రేమించి అబ్బాయి తనను దక్కించుకునేందుకు హిందూ మతం తీసుకునేందుకు సమ్మతించాడు. 

కానీ, అది కూతురు తండ్రికి నమ్మశక్యం కాలేదు. ఇదంతా ఓ ట్రాప్ అని పెళ్లి అయ్యేంత వరకూ ఆడుతున్న నాటకం అని న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాడు. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన బెంచ్‌లో తీర్పు వెల్లడైంది. మతాంతర వివాహం, కులాంతర వివాహం సమస్య కాదు మహిళ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ వ్యక్తి గ్రేట్ లవర్ అని నిరూపించుకోవాల్సి ఉందని, బాధ్యత కలిగిన భర్తలా ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చింది. 

అపెక్స్ కోర్టు.. వ్యక్తి నుంచి అఫిడవిట్‌తో పాటు బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకురావాలని అడిగింది. ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుని తర్వాత అతని పేరు కూడా మార్చుకోవాలని సూచించారు. ఇది మతాలకు, నమ్మకాలకు వ్యతిరేకం ఏమీ కాదు. కేవలం మహిళ భవిష్యత్ క్షేమంగా ఉండాలని మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు.