లింగాయత్‌ మఠాధిపతిగా 33 ఏళ్ల ముస్లిం వ్యక్తి: అరుదైన ఘట్టం

  • Published By: veegamteam ,Published On : February 21, 2020 / 06:03 AM IST
లింగాయత్‌ మఠాధిపతిగా 33 ఏళ్ల ముస్లిం వ్యక్తి: అరుదైన ఘట్టం

కర్ణాటకలోని లింగాయత్‌ మఠానికి ఓ ముస్లిం వ్యక్తి అధిపతిగా నియమితులు కానున్నారు. గడగ్‌ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠంలో ఫిబ్రవరి 26న ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతంకానుంది. మఠానికి చెందిన గోవింద్‌ భట్‌, బసవేశ్వరుడి బోధనలపై దివాన్ షరీఫ్ ముల్లా అనే వ్యక్తి ఎంతో విశ్వాసం పెంచుకున్నారు. చిన్ననాటినుంచి వారు బోధనలంటే ఎంతో ఇష్టం పెంచుకున్నాడు. అలా లింగాయత్ మఠం బోధనలపై దివాన్ షరీఫ్ ప్రభావితమయ్యాడు. ఓ ముస్లిం తమ బోధనలు వినటం పట్ల ఎంతో ఆనందం వ్యక్తంచేశారు. 

ఈ  క్రమంలో లింగాయత్  మఠానికి అధిపతిగా దివాన్‌ షరీఫ్‌ ముల్లా అర్హుడని వారు భావించారు. దీంతో షరీఫ్ కు జంధ్యాన్ని ధరింపజేసి మఠం బాధ్యతలను అప్పగించారు. మఠానికి చెందిన కజురి స్వామిజీ కూడా సంప్రదాయం ప్రకారం ఇష్ట లింగాన్ని దివాన్‌కు అందజేశారు. చిత్రదుర్గలోని శ్రీజగద్గురు మురుగరాజేంద్ర మఠానికి చెందిన 361 శాఖల్లో గడగ్‌లోని లింగాయత్‌ మఠం ఒకటి. అక్కడి స్వామీజీల బోధనలకు ఆకర్షితులైన దివాన్‌ షరీఫ్‌ ముల్లా తల్లిదండ్రులు.. ఆ మఠానికి రెండు ఎకరాల భూమిని విరాళంగా కూడా ఇచ్చారు. 

ఈ క్రమంలో షరీఫ్‌ కూడా మఠం పట్ల ఆకర్షితు లై.. అందులో చేరారు. తాను మఠం బాధ్యతలు చేపట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని దివాన్‌ షరీఫ్‌ ఆనందం వ్యక్తంచేస్తూ తెలిపారు. మళం తనపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని బసవ బోధనలను మరింతంగా ప్రచారం చేస్తానని తెలిపారు. తాను మేనసాగి గ్రామంలో పిండి మిల్లు నడుపుతుంటాననీ..ఖాళీ సమయాల్లో లింగాయత్ మఠానికి వచ్చి బోధనలు వినటం..మఠానికి సేవలు చేయటం చిన్ననాటి నుంచి అలవాటుగా మారిందనీ..దీంతో మఠాధిపతులు భోధనలు తనను ఎంతో ప్రభావితం చేశారని తెలిపాడు షరీఫ్. మురుగరాజేంద్ర స్వామి తన సేవలను గుర్తించినందుకు ఇంతటి బాధ్యతను తనపై నమ్మకంతో అప్పగిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని బసవ బోధనలను మరింతంగా ప్రచారం చేస్తానని తెలిపారు. 

‘నీ కులం, మతం ఏమిటన్నది ప్రధానం కాదు..ఏమతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా అందరికీ భగవంతుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తే మనుషులు సృష్టించిన కులమతాలనేవి అడ్డంకులు కావు’ అని శ్రీ మురుగరాజేంద్ర కొరానేశ్వర స్వామి చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడుతున్నవేళ కర్ణాటకలో ఈ ఘటన జరుగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా..గడగ్‌ మఠంలో ఇటువంటివి సర్వసాధారణమనీ.. గతంలోనూ కొందరు ముస్లింలు జాత్రా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారని కాంగ్రెస్‌ నేత హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. కాగా శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర మఠం కర్ణాటక, మహారాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అనుచరులున్నారు. మురుగరాజేంద్ర బోధనలు ఎంతో మందిని ఆకర్షితులైనవారు ఎంతో మంది ఉన్నారు.