రోడ్డు మీదే కరోనా పేషెంట్ మృతి.. క్షమాపణ కోరిన ఐఏఎస్ ఆఫీసర్

రోడ్డు మీదే కరోనా పేషెంట్ మృతి.. క్షమాపణ కోరిన ఐఏఎస్ ఆఫీసర్

అంబులెన్స్ కోసం రోడ్డుపైనే వెయిట్ చేసి ప్రాణాలు వదిలిన కొవిడ్ 19బాధితుడి కుటుంబాన్ని బెంగళూరు కమిషనర్ క్షమాపణ అడిగారు. రెండు గంటల తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. 55ఏళ్ల మనిషిని కోల్పోయిన కుటుంబాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికేకు చెందిన నివాసానికి వెళ్లి కలిశారు.

‘హద్దుల్లేని క్షమాపణ అడుగుతున్నాను. మా స్టాఫ్ పరిస్థితిని ఇంకొంచె బెటర్ పద్ధతిలో హ్యాండిల్ చేయాల్సింది’ అని కమిషనర్ ఆఫ్ ద బీబీఎంపీ అన్నారు. దాంతో పాటుగా కొవిడ్ పేషెంట్ కుటుంబం ఎదుట చేతులు జోడించి ఉన్న ఫొటోను షేర్ చేశారు. అదే ట్వీట్ లో దేశ పౌరులను కొవిడ్ 19 పేషెంట్ల పట్ల వివక్ష చూపించొద్దని కోరారు.

కొవిడ్ 19తో బాధపడుతూనే ఇంటి వద్దనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వ్యక్తికి శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. అతని భార్య హాస్పిటల్ కు సమాచారం ఇచ్చి అంబులెన్స్ కావాలని అడిగింది. అంబులెన్స్ రావడం లేట్ అవుతుండటంతో కుటుంబం అతణ్ని ఆటోలో తీసుకెళ్లాలని ఫిక్స్ అయింది.

ఇదే క్రమంలో ఇంటి నుంచి బయటికి వస్తుండగానే అతను కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై సివిక్ బాడీ కమిషనర్ ఘటనపై విచారణ జరపాలని అన్నారు. కరోనావైరస్ సంక్షోభానికి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఇన్ ఛార్జిగా ఉన్న ఆర్ అశోక్ దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వారం రోజులుగా బెంగళూరులో కేసులు పెరిగిపోతూ ఉన్నాయి.

కర్ణాటకలో 19వేల 710 కన్ఫామ్ కేసులు ఉన్నాయి. ఇందులో 293 మంది వైరస్ ప్రభావానికి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారానికి రాష్ట్రంలో వెయ్యి 694కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 994నమోదై ఒక్క రోజులో రికార్డు సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. జులై 5నుంచి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు బెంగళూరు మొత్తం ఫుల్ లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.