Bengaluru policemen: చిన్నారులకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం పోలీసుల రక్తదానం

బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ కార్యాలయం తాత్కాలికంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ గా మారిపోయింది. బెంగళూరు ఎన్జీఓ అయినటువంటి ఎస్ఈడీటీ, లయన్స్ బ్లడ్ బ్యాంక్, బెంగళూరు పోలీసులు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Bengaluru policemen: చిన్నారులకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం పోలీసుల రక్తదానం

Bengalore Police

Bengaluru policemen: బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ కార్యాలయం తాత్కాలికంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ గా మారిపోయింది. బెంగళూరు ఎన్జీఓ అయినటువంటి ఎస్ఈడీటీ, లయన్స్ బ్లడ్ బ్యాంక్, బెంగళూరు పోలీసులు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇలా డొనేట్ చేసిన రక్తాన్ని కిడ్వా మెమొరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ క్యాన్సర్ రీసెర్చ్ లో క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారుల ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారు. మొత్తం 75మంది పోలీసులు బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనగా అందులో డీసీపీ సంజీవ్ పాటిల్ కూడా ఉన్నారు.

కీమోథెరఫీ తీసుకుంటున్న పిల్లలు దారుణమైన బాధకు గురవుతున్నారు. వారికి ప్లేట్ లెట్ల అవసరం కూడా ఎంతో ఉందని ఎస్ఈడీటీ ప్రెసిడెంట్ ప్రకృతి ప్రసన్న అంటుననారు.

చాలా మంది డోనార్లు ఉన్నప్పటికీ కరోనా పరిస్థితులు కావడంతో డోనార్ల కొరత ఏర్పడింది. 90శాతానికి పైగా మహమ్మారికి భయపడి రక్తదానానికి ముందుకు రావడం లేదు. మరో విషయం ఏమిటంటే.. క్యాంపులోనే ఇన్ఫెక్షన్ ఉంటే ఏం చేయగలమని ప్రశ్నిస్తున్నారు.

డీసీపీ సంజీవ్ పాటిల్ మాట్లాడుతూ.. కొవిడ్-19ఇన్ఫెక్షన్లు మొదలవడంతో డోనార్ల కొరత ఏర్పడిన విషయం అందరూ తెలుసుకున్నాం. పలు కారణాల రీత్యా సెకండ్ వేవ్ సమయంలో హాస్పిటల్ కు వెళ్లినప్పుడు కొవిడ్-19 భయంతో చాలా మంది రక్తదానం చేసేందుకు భయపడుతున్నట్లుగా తెలిసింది. ల్యాబ్ లు, క్యాంపుల్లో వైరస్ పొంచి ఉందనే భయంలో ముందుకు రావడం లేదు.

సెకండ్ వేవ్ అయిపోగానే ఎస్ఈడీటీని కలిసి క్యాంపును ఏర్పాటు చేశాం. భవిష్యత్ లో మరోక్యాంపు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఒక్క సింగిల్ యూనిట్ బ్లడ్ ముగ్గురు జీవితాలను కాపాడుతుంది. దీని కోసం ఒక డ్రైవ్ కండక్ట్ చేయాలనుకుంటున్నామని అన్నారు డీసీపీ.

కోఆపరేటివ్ గా పనిచేస్తూ బెంగళూరు పోలీసులు మంచి ఇనీషియేటివ్ తీసుకున్నారని ప్రసన్న అంటున్నారు. వారంతా కలిసి 10వేల యూనిట్లకు పైగా రక్తన్నా డొనేట్ చేయగలిగారని వెల్లడించారు.