BF7 Omicron Variant : మెడికల్ ఆక్సిజన్ స్టాక్ పెట్టుకోండి : రాష్ట్రాలకు కేంద్రం సూచన

కోవిడ్ BF7 Omicron Variant ఆందోళనతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేస్తోంది. దీంట్లో భాగంగా మెడికల్ ఆక్సిజన్ స్టాక్ పెట్టుకోవాలని ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవటానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. దీంట్లో భాగంగానే మెడికల్ ఆక్సిజన్ లభ్యత ఎలా ఉంది? అనే అంశంపై ఆరా తీసింది. ఆక్సిజన్ స్టాక్..లభ్యత వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీవారం సమీక్షలు జరపాలని తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

BF7 Omicron Variant : మెడికల్ ఆక్సిజన్ స్టాక్ పెట్టుకోండి : రాష్ట్రాలకు కేంద్రం సూచన

'Ensure regular supply of oxygen'..Centre tells states

BF7 Omicron Variant : కోవిడ్ BF7 Omicron Variant ఆందోళనతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేస్తోంది. దీంట్లో భాగంగా మెడికల్ ఆక్సిజన్ స్టాక్ పెట్టుకోవాలని ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవటానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. దీంట్లో భాగంగానే మెడికల్ ఆక్సిజన్ లభ్యత ఎలా ఉంది అనే అంశంపై ఆరా తీసింది. ఆక్సిజన్ స్టాక్..లభ్యత వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీవారం సమీక్షలు జరపాలని తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆస్పత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని..ఎటువంటి నిర్లక్ష్యం వహించటానికి వీల్లేదని హెచ్చరించింది. మెడికల్ ఆక్సిజన్ స్టాక్ పెట్టుకోవాలని ఎటువంటి కొరతా రాకుండా చూసుకోవాలని..అన్ని రాష్ట్రాల్లోను ఆక్సిజన కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని సూచించింది.

కాగా కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందుబాటులో లేక ఎన్నో ప్రాణాలు బలైపోయాయి. ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నిండుకున్నాయి. ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు. తల్లులు బిడ్డల్ని కోల్పోయి..పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఘటనలో భారత్ లో పెను విషాదాలను చూశాం. ఇటువంటి పరిస్థితి మరోసారి రావద్దని కేంద్రం ముందస్తు హెచ్చరికలు..సూచనలు చేస్తోంది రాష్ట్రాలకు.

చైనాతోపాటు అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ దేశాలైన బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ సహా ఇతర దేశాల్లోనూ BF7 Omicron Variant కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చైనాలో లక్షలాది కేసులు హడలెత్తిస్తున్నాయి. ఈ ప్రభావం పలు దేశాలపై ఇప్పటికే పడగా భారత్ లో కూడా ఈ BF7 Omicron Variant కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణులతో సమావేశమయ్యింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించింది.

భారత్ లోకి కూడా బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ ప్రేవేశించింది. దేశంలో మూడు కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. గుజరాత్ లోని వడోదరలో ఓ ఎన్ ఆర్ ఐ మహిళతో పాటు మరొకరికి, ఒడిశాలో ఒకరిలో ఈ వేరియంట్ ను గుర్తించినట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో అన్ని ఎయిర్ పోర్టులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా టెస్టులు చేయడంతోపాటు జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ సూచించారు.