రైతు సంఘాల పిలుపు మేర కొనసాగుతున్న భారత్ బంద్

రైతు సంఘాల పిలుపు మేర కొనసాగుతున్న భారత్ బంద్

 

 

[svt-event title=”మహారాష్ట్రలో రైలును అడ్డగించి రైతుల నిరసన” date=”08/12/2020,9:15AM” class=”svt-cd-green” ] రైతు సహాయ సంఘాలు మంగళవారం రైల్ రోకో చేపట్టి మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో నిరసన వ్యక్తం చేశాయి. భారత్ బంద్ నేపథ్యంలో స్వాభిమాని శేత్కారీ సంఘటన సభ్యులు చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు. [/svt-event]

 

[svt-event title=”తెలంగాణ కరీంనగర్ లో నేతల నిరసన” date=”08/12/2020,9:14AM” class=”svt-cd-green” ] కరీంనగర్ జిల్లాలో రైతుల నిరసన కొనసాగుతుంది. వారికి తోడుగా విపక్షాలు కూడా మద్ధతు ఇచ్చాయి. రాజకీయాలకు అతీతంగా ఈ బంద్ చేస్తున్నాం. రైతులకు తామెప్పుడూ తోడుంటామని నేతలు అంటున్నారు. ఢిల్లీ నుంచి కరీంనగర్ వీధుల వరకూ భారత్ బంద్ ప్రభావం కనిపిస్తుంది. [/svt-event]

 

[svt-event title=”విశాఖ రోడ్లపై నిరసన” date=”08/12/2020,8:12AM” class=”svt-cd-green” ] రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం వేదికగా లెఫ్ట్ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్ కు మద్దతు ఇస్తున్నాయి. పార్టీలతో పాటు రైతు సంఘాల అసోసియేషన్స్ కలిసి కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. [/svt-event]

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రగిలిపోతున్న రైతులు.. దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రైతులు భారత్ బంద్‌‌ను ఇవాళ(డిసెంబర్ 8) నిర్వహిస్తుండగా.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సాయంత్రం 4 గంటల తర్వాత యధావిధిగా పనులు జరుపుకోవాలని కోరాయి.