Bhopal hospital fire : ఆస్పత్రిలో శిశువులు సజీవదహనం..బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

భోపాల్ లోని కమలానెహ్రూ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు శిశువులు సజీవ దహనమైయ్యారు.

Bhopal hospital fire : ఆస్పత్రిలో శిశువులు సజీవదహనం..బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

Bhopal Hospital Fire (1)

Bhopal hospital fire : ఓ ఆస్పత్రిలో సంభవించిన అగ్నిప్రమాదానికి నలుగురు శిశువులు సజీవంగా దహనమైన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని బోపాల్ లో చోటుచేసుకుంది. నగరంలోని కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం (నవంబర్ 8,2021)రాత్రి పీడియాట్రిక్స్ వార్డులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వార్డులు 40 మంది చిన్నారులు ఉండగా వీరిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 36 మంది శిశువులును సిబ్బంది సురక్షితంగా రక్షించగలిగారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 25 ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

Read more :Fire Accident: కమలానెహ్రూ ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం

రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ ఘటనాస్థంలో సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోందని భోపాల్ నార్త్ ఎస్పీ విజయ్ ఖత్రి వెల్లడించారు. మంటలు చెలరేగిన సమయంలో తీవ్ర భయాందోళనలకు గురైన శిశువుల తల్లిదండ్రులు తమ తమ చిన్నారులను తీసుకుని ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు పెట్టారు. వార్డులో పొగలు వ్యాపించడంతో చిన్నారులతో పాటు పెద్దలు, ఆస్పత్రి సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు.

Read more : Objectionable Remark Case: జయప్రదపై అండర్‌వేర్ కామెంట్స్.. కోర్టులో కేసు విచారణ నేడే!

లోపల ఉన్న చిన్నారుల పరిస్థితి గురించి తెలియక వారి తమ బిడ్డలు ఏమైపోయారో అనే ఆందోళనతో తల్లిదండ్రులు అర్ధరాత్రి వరకూ ఆస్పత్రి బయటే కళ్లల్లో ఒత్తులు వేసుకుని పడిగాపులు కాశారు. పొగ వ్యాపించటంతో శిశులు తీవ్ర అస్వస్థతకు గురికాగా..వారిని హుటాహుటిన మరో వార్డుకు తరలించినట్లుగా సమాచారం. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. తమ బిడ్డలు ప్రాణాలతో బయటపడాలని తిరిగి తమ ఒడికి క్షేమంగా రావాలని తల్లిదండ్రులు కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.