Bihar : అత్తారింటిలోఉన్న చెల్లెలిని కిడ్నాప్ చేసి తీసుకుపోయిన సోదరుడు
అన్న అంటే చెల్లెలికి పెళ్లి చేసిన పంపిస్తాడు. తన చెల్లిలికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోమని అప్పగింతలు పెడతాడు. కానీ ఓ అన్నమాత్రం అత్తారింటిలో ఉన్న చెల్లెలిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి బైక్ మీద ఎత్తుకుపోయాడు.

brother kidnapped sister
Bihar man kidnapped sister : అన్న అంటే చెల్లెలికి పెళ్లి చేసిన పంపిస్తాడు. తన చెల్లిలికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోమని అప్పగింతలు పెడతాడు. కానీ ఓ అన్నమాత్రం అత్తారింటిలో ఉన్న చెల్లెలిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి బైక్ మీద ఏదో లగేజీని పట్టుకెళ్లినట్లుగా ఎత్తుకుపోయాడు. దీనికి కారణం ‘కులం’. సోదరి కులాంత వివాహం చేసుకుందనే కోపం. ఆ కోపంలోనే అన్న కిడ్నాప్ చేసి మరీ ఎత్తుకుపోయాడు.
బిహార్‌లోని అరారియా జిల్లాలో కులాంత వివాహం చేసుకున్న చెల్లెలిపై కక్ష కట్టిన అన్న అత్తారింటిలో కాపురం చేసుకుంటున్న చెల్లెలిని ఎత్తుకొచ్చేశాడు. బైక్‌పై వచ్చి సినీ ఫక్కీలో అత్తారింటి నుంచి తనను ఎత్తుకెళ్లిపోయాడు. రూపా కుమారి, ఛోటు కుమార్ ఠాకుర్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడం వల్ల యువతి కుటుంబం పెళ్లికి అంగీకరించలేదు. దీంతో రూప చోటును వదులుకోవానికి ఇష్టపడలేదు. ఈక్రమంలో కుటుంబాన్ని ఎదిరించి జూన్ 2 ఇంట్లోంచి పారిపోయింది. సుపాల్ జిల్లాకు వెళ్లి అక్కడ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
Rajasthan : ఇదేం ప్రేమరా బాబు .. వధువును కిడ్నాప్ చేసి ఎడారిలో ’ఏడు అడుగులు’..
సోదరి ఇంట్లోంచి పారిపోయిందని గుర్తించిన సోదరుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. చోటు కుమార్ కోసం వెదుకుతున్నాడు. కానీ కనిపించలేదు. ఈక్రమంలో వివాహం చేసుకుని రూపా కుమారిని చోటు కుమార్ బధ్ నాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్ నగర్ గ్రామంలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసింది రూపాకుమారి సోదరుడికి. అంతే మరో వ్యక్తిని తీసుకుని బైక్ పై రూప అత్తారింటికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి చెల్లెలిని బలవంతంగా రెండు చేతులపై ఎత్తుకుని తీసుకెళ్లి బైక్ మీద కూర్చున్నాడు. అంతే బైక్ పై అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదంతా స్థానికులు వీడియోలు తీశారు. అనంతరం చోటు కుమార్ తన భార్యను తీసుకురావటానికి రూప ఇంటికి వెళ్లగా ఆమె తండ్రీ, సోదరుడు దాడి చేశారు. దీంతో తన భార్యను కిడ్నాప్ చేసి తీసుకుపోయారని తీసుకురావటానికి వెళితే తనపై కూడా దాడి చేశారు అంటూ బథ్‌నాహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని పోలీస్‌స్టేషనుకు తీసుకువచ్చి విచారించారు. రూప తన సోదరుడు తను రాను అని అంటున్నా బలవంతంగా తీసుకుపోయాడని తను తన భర్తతోనే కలిసి ఉంటానని చెప్పింది. ఆమె వాంగ్ములాన్ని తీసుకున్న పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారి కుశ్రు సిరాజ్ తెలిపారు.
Viral Letter : నాకు పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి సార్, అమ్మాయి ఎలా ఉండాలంటే..: అధికారులకు లెటర్