Bill Gates: బిల్‌గేట్స్‌కు బాంబే హైకోర్టు నోటీసులు.. వెయ్యి కోట్లు ఇవ్వాలంటూ పిటిషన్.. ఎందుకంటే

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌కు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ సంస్థకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె మరణానికి కారణమయ్యారంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

Bill Gates: బిల్‌గేట్స్‌కు బాంబే హైకోర్టు నోటీసులు.. వెయ్యి కోట్లు ఇవ్వాలంటూ పిటిషన్.. ఎందుకంటే

Bill Gates: ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్‌గేట్స్‌కు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె మరణానికి కారణమయ్యారంటూ దిలీప్ లూనావత్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన బాంబే హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

Ravindra Jadeja: ఆసియా కప్ నుంచి జడేజా ఔట్… అక్సర్ పటేల్‌కు అవకాశం

బిల్‌గేట్స్‌తోపాటు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఎయిమ్స్, వివిధ ఔషధ అధికారులకు నోటీసులు జారీ చేసింది కోర్టు. తన కుమార్తె మరణానికి బాధ్యత వహిస్తూ, రూ.వెయ్యి కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని దిలీప్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కేసు వివరాల ప్రకారం.. దిలీప్ లూనావత్ కుమార్తె డాక్టర్‌గా పనిచేసేవారు. అయితే, 2020లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొత్తగా వచ్చిన సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్ల పేరిట దీన్ని వారికి మొదటగా అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపని తన కుమార్తెకు బలవంతంగా వ్యాక్సిన్ ఇచ్చినట్లు దిలీప్ పేర్కొన్నాడు. వ్యాక్సిన్ సురక్షితమే అని తన కుమార్తెను నమ్మించినట్లు చెప్పాడు.

BJP: తెలంగాణకు అమిత్ షా.. 17న బీజేపీ భారీ బహిరంగ సభ.. ఏడాదిపాటు విమోచన దినోత్సవాలు

అయితే వ్యాక్సిన్ తీసుకున్న దిలీప్ కుమార్తే, తర్వాత వ్యాక్సిన్ సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మరణించింది. దీంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్‌తోపాటు, ఈ సంస్థ భాగస్వామ్యం కలిగిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు నోటీసులు జారీ చేశారు. తన కూతురు మరణానికి కారణమైనందుకు రూ.1,000 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కోర్టు, ఈ అంశంపై జవాబు చెప్పాలని కోరూతూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.