Kharge Dog Remark: ‘బీజేపీ నుంచి కుక్క కూడా..’ అంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. దద్దరిల్లిన పెద్దల సభ

మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశఆరు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నారని రాజ్యసభలో వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. ఖర్గే క్షమాపణ చెప్పకపోతే రాజ్యసభలో ఉండే అర్హత ఉండదని అన్నారు.

Kharge Dog Remark: ‘బీజేపీ నుంచి కుక్క కూడా..’ అంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. దద్దరిల్లిన పెద్దల సభ

BJP demands apology over dog remarks, Kharge refuses

Kharge Dog Remark: చైనా-ఇండియా మధ్య నెలకొన్ని ఘర్షణ వాతావరణం దేశ రాజకీయాల్ని కుదిపివేస్తోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద రాజకీయ యుద్ధమే జరుగుతోంది. ఇక పార్లమెంట్ సమావేశాలు కూడా ఇదే సమయంలో రావడంతో.. ఇది పతాక స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన ‘కుక్క’ వ్యాఖ్యలు రాజ్యసభను కుదిపివేస్తున్నాయి. ఖర్గే క్షమాపణ చెప్పాలంటూ భారతీయ జనతా పార్టీ నేతలు సభలోనే ఆందోళనకు దిగారు. అయితే అందుకు ఖర్గే నిరాకరించడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Encounter Maoist Killed : ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం రాజస్తాన్ రాష్ట్రంలోని అల్వార్‭లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ ‘‘బయటికేమో సింహంలాంటి మాటలు మాట్లాడతారు. కానీ చిట్టెలుకలా ప్రవర్తిస్తున్నారు. సరిహద్దుల వెంబడి చైనా దురాక్రమణలకు పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? దీనిపై పార్లమెంట్‭లో చర్చ కూడా చేయడం లేదు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది. అనేక మంది కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారు. మరి బీజేపీ ఏం చేసింది? స్వాతంత్ర్యం కోసం బీజేపీ ఒక కుక్కనైనా కోల్పోయిందా? మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. ఇంతకీ దేశానికి వాళ్లు (బీజేపీ) చేసింది ఏంటి?’’ అని ఖర్గే మండిపడ్డారు.

Job Scam : ‘వచ్చే పోయే రైళ్లను..బోగీలను లెక్కపెట్టే ఉద్యోగం’అంటూ రూ.2.6కోట్లు దోచేసిన కేటుగాళ్లు..

అంతే, మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశఆరు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నారని రాజ్యసభలో వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. ఖర్గే క్షమాపణ చెప్పకపోతే రాజ్యసభలో ఉండే అర్హత ఉండదని అన్నారు. అయితే పార్లమెంట్ వెలుపల చేసిన వ్యాఖ్యలపై ఎందుకంత మిడిసిపాటని, వాటిని సభలో చర్చించాల్సిన అవసరం లేదని ఖర్గే సమాధానం ఇచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుగుతున్నారా? అంటూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.