BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 07:01 AM IST
BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింఘ్, సుష్మా స్వరాజ్, కీలక నేతలు పాల్గొన్నారు. ‘సంకల్ప్ ప్రత్’ పేరిట ఈ మేనిఫెస్టో రూపొందించింది. దీనిలోని అంశాలను రాజ్ నాథ్ సింగ్ వివరించారు. 
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర

  • పేద, మధ్య తరగతి రైతులకు పెన్షన్లు.
  • రైతులకు వడ్డీ లేని రుణాలు, రైతు పెట్టుబడి సాయం కొనసాగింపు.
  • జీరో పర్సెంట్ క్రెడిట్ కార్డులు.
  • ఐదేళ్ల పాటు వడ్డీ లేకుండా లక్ష రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డులు. 
  • 60 ఏళ్లు దాటిన రైతులు, చిన్న వ్యాపారులకు ఫించన్. 
  • పౌరసత్వం బిల్లుకు త్వరలో ఆమోదం.
  • ఎలాంటి గుర్తింపు లేకున్నా పౌరసత్వానికి ఆమోదం.
  • ఉగ్రవాదం నిర్మిలిస్తాం. 
  • సిటిజన్ షిప్ సవరణ బిల్లును ఆమోదిస్తాం.
  • రామమందిరం నిర్మాణం త్వరగా అయ్యేలా చూస్తాం.
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం. 
  • డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్ అమలు.
  • నీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తాం. 
  • యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
  • అందరికీ ఉన్నత విద్య అందేలా ఏర్పాట్లు.
  • అందరికీ విద్య. 75 కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తాం.
  • ప్రజల సంఖ్యకు అనుగుణంగా వైద్యుల సంఖ్యను పెంచుతాం.
  • ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై సింగిల్ విండో సిస్టం తీసుకొస్తాం.
  • డిజిటల్ లావాదేవీలు పెంచుతాం.
  • పంచతీర్థాల సర్క్యూట్ పూర్తి చేస్తాం.
  • మహిళలకు ఉద్యోగ కల్పన పెంచుతాం.
  • ట్రిపుల్ తలాక్ అంశంపై ముస్లిం మహిళలకు న్యాయం. 
  • 25 లక్షల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు.
  • రైతులందరికీ ఇన్ కం సపోర్టు రూ. 6వేలు ఇస్తాం.

Read Also : 2019 వరల్డ్ కప్.. టీమిండియా జట్టు ప్రకటన ఎప్పుడంటే?