ఓటు వేస్తేనేనా : ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల…బుల్లెట్ రైలులా దేశరాజధానిలో అభివృద్ధి

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2020 / 04:08 PM IST
ఓటు వేస్తేనేనా : ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల…బుల్లెట్ రైలులా దేశరాజధానిలో అభివృద్ధి

ఫిబ్రవరి-8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇవాళ(జనవరి-31,2020)ఢిల్లీలో కేంద్రమంత్రలు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జావదేకర్, హర్షవర్థన్ ,ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ ల సమక్షంలో బీజేపీ మెనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ…దేశరాజధానిలో అభివృద్ధిని బుల్లెట్ రైలులా పరుగులు పెట్టిస్తామని అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద ఢిల్లీలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని తెలిపారు.  ఎయిర్ పోల్యూషన్ డీల్ చేయడం కోసం 55వేల కోట్లు కేటాయిస్తామన్నారు.

కేంద్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలైన ఆయుష్మాన్ భారత్,కిసాన్ సమ్మాన్ నిధి పధకాలను ఢిల్లీలో అమలుచేస్తామని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తెలిపారు. కాలేజీ విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు,స్కూల్ కు వెళ్లే 9,10వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తామని తెలిపారు. ఢిల్లీలో ఎరికైనా ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి పేరుతో బ్యాంక్ అకౌంట్ ప్రారంభించి ఆ అమ్మాయికి 21సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఆ అమ్మాయికి రూ.2లక్షలు వస్తాయని తివారీ తెలిపారు. వ్యాపారాలకు తీవ్రమైన సమస్యగా మారిన సీలింగ్ ప్రాబ్లంకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.అద్దె నివాసాల్లో ఉంటున్నవారి రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కొత్త కాలనీ డెవలప్ మెంట్ బోర్టు ఏర్పాటు చేసి కొత్త కాలనీల అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 

మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై ఢిల్లీ సీఎం,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ఢిల్లీ ప్రజలను బీజేపీ మేనిఫెస్టో పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఉచిత కరెంట్,ఉచిత బస్ రైడ్,ఉచిత రక్షిత మంచినీరు ఢిల్లీ వాసులకు ఇవ్వబోమని బీజేపీ మేనిఫెస్టో నిరూపించిందని,బీజేపీకి ఓటు వేస్తేనే ఇవన్నీ ఇస్తామని చెబుతోందని కావున అందరూ ఆలోచించి ఓటు వెయ్యాలని ఓటర్లకు పిలుపునిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.