Chandigarh: ఒక్క ఓటు తేడాతో మేయర్ సీటు దక్కించుకున్న బీజేపీ.. చండీగఢ్ మేయర్‌గా అనూప్ గుప్తా

మున్సిపాలిటీలో మొత్తం 45 సీట్లు ఉన్నాయి. అందులో 9 నామినేటెడ్ సీట్లు. ఒకటి ఎక్స్ అఫీషియో ఓటు (చండీగఢ్ ఎంపీ). కాగా మిగతా 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 14 స్థానాలు గెలిచి, అతిపెద్ద పార్టీగా నిలిచింది.

Chandigarh: ఒక్క ఓటు తేడాతో మేయర్ సీటు దక్కించుకున్న బీజేపీ.. చండీగఢ్ మేయర్‌గా అనూప్ గుప్తా

Chandigarh: చండీగఢ్ మున్సిపాలిటీ మేయర్ ఎన్నికలో ఒక్క ఓటు తేడాతో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ మేయర్ అభ్యర్థి అనూప్ గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి మేయర్‌గా ఎన్నికయ్యారు. మంగళవారం చండీగఢ్ మేయర్ ఎన్నిక జరిగింది. 2021 డిసెంబర్‌లో చండీగఢ్ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి.

PM Shehbaz Sharif: గుణపాఠం నేర్చుకున్నాం.. భారత్ ప్రధాని మోదీతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం

మున్సిపాలిటీలో మొత్తం 45 సీట్లు ఉన్నాయి. అందులో 9 నామినేటెడ్ సీట్లు. ఒకటి ఎక్స్ అఫీషియో ఓటు (చండీగఢ్ ఎంపీ). కాగా మిగతా 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 14 స్థానాలు గెలిచి, అతిపెద్ద పార్టీగా నిలిచింది. తర్వాత స్థానంలో బీజేపీ 12 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి 8, శిరోమణి అకాలీదళ్ పార్టీకి ఒక సీటు వచ్చాయి. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు బీజేపీలో చేరిపోయారు. దీంతో బీజేపీ సీట్లు 16కు చేరగా, కాంగ్రెస్ 6 సీట్లకు పడిపోయింది. తాజా మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి 14 సీట్లు, బీజేపీకి 12 సీట్లు ఉన్నాయి.

Chiranjeevi : ఇప్పటి జనరేషన్ అయినా ఇలా చేయండి.. నాన్నని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి..

అయితే, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరితో కలిపి బీజేపీ ఓట్ల సంఖ్య 14కు చేరింది. ఈ క్రమంలో బీజేపీ, ఆప్.. రెండు పార్టీలూ సమానంగా ఉన్నప్పటికీ, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడంతో బీజేపీ మేయర్ అభ్యర్థి విజయం సాధించాడు. ఒక్క ఓటు తేడాతో బీజేపీ అభ్యర్థి అనూప్ గుప్తా చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యాడు.