Indian Market : రష్యా, ఉక్రెయిన్ యుద్ధ మేఘాలు.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్ లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. గత కొన్ని రోజులుగా నష్టాల బాట పడుతున్న మార్కెట్లు.. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం భారీ నష్టాలను చవి చూశాయి...

Stock Market
Indian Stock market : రష్యా, ఉక్రెయిన్ యుద్ధభయాలు స్టాక్‌మార్కెట్లను ముంచేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ దారుణంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 17వందల 47 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 531పాయింట్లు కోల్పోయింది. నిప్టీ కీలకమైన 17వేల మార్కును కోల్పోయింది. 16వేల 842వద్ద నిఫ్టీ ముగిసింది. రష్యా ఏ క్షణమైనా యుక్రెయిన్‌ను ఆక్రమించొచ్చన్న అమెరికా హెచ్చరికలు, ఏడేళ్ల గరిష్ఠానికి చేరిన ఆయిల్ ధరలు మార్కెట్లను ముంచేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో సాగడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
Read More : Ramanuja Sahasrabdhi: శ్రీ రామానుజ స్వర్ణమూర్తికి ప్రాణ ప్రతిష్ట
యుద్ధభయాలతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. ఉదయం భారీ నష్టాలతో మొదలైన మార్కెట్లు తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. మధ్యాహ్నం తర్వాత మరింత దిగజారాయి. అన్ని ఇండెక్స్‌లు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ షేర్లలో ఒక్క టీసీఎస్ మాత్రమే లాభపడింది. ఆ షేరు 38 రూపాయలకు పైగా లాభపడింది. JSW స్టీల్, HDFC లైఫ్‌లు 6శాతానికి పైగా పడిపోయాయి. ITC, టాటామోటార్స్, టాటా స్టీల్ కూడా 5శాతానికి పైగా నష్టపోయాయి. ICICI, SBI, IOC షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Read More : Ramachandarrao: తెలంగాణలో ఏదైనా జరగొచ్చంటూ బీజేపీ రామచంద్రరావు వ్యాఖ్యలు
మరోవైపు…ఉక్రెయిన్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దాడిచేసే ఉద్దేశమే లేదంటున్న రష్యా… మరోవైపు ఉక్రెయిన్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించినట్లు తాజా ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మాక్సార్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. క్రిమియా, బెలారస్, పశ్చిమ రష్యా ప్రాంతాల్లో రష్యా కొత్తగా పెద్ద ఎత్తున మిలిటరీ బలగాలను మోహరించినట్లు ఈ ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. క్రిమియాలోని ఎయిర్‌ఫీల్డ్ వద్ద… పెద్ద సంఖ్యలో కొత్త సైనిక మోహరింపులు జరిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వాడుకలో లేని ఈ విమానాశ్రయం వద్ద 550కు పైగా సైనికుల టెంట్లు, వందల సంఖ్యలో వాహనాలున్నాయి. అలాగే… నోవూజెర్నోయే ప్రాంతానికి కూడా ఇటీవల కొత్త బలగాలు చేరుకున్నాయి.