Bombay HC : ప్రేమించి..జాతకాలు కలవలేదని పెళ్లి చేసుకోనన్న యువకుడు..దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు
ప్రేమించాను..కానీ ఆమెకు నాకు జాతకాలు కలవలేదు..కాబట్టి పెళ్లి చేసుకోను అన్న యువకుడికి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రేమించినప్పుడు లేని జాతకాల పట్టింపు పెళ్లి చేసుకోవటానికి..

Bombay HC : ప్రేమించాను..కానీ ఆమెను పెళ్లి చేసుకోవటానికి మా జాతకాలు కలవలేదు..కాబట్టి నేను ఆమెను పెళ్లి చేసుకోను అని చెప్పిన ఓ యువకుడికి ముంబై హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ప్రేమించినప్పుడు లేని జాతకాల పట్టింపు ఆమెను అన్ని విధాలుగా నమ్మించి పెళ్లి విషయం వచ్చేసరికి జాతకాలు అంటూ తప్పించుకుంటే ఊరుకుంటామా అన్నట్లుగా కోర్టు సదరు యువకుడి బెయిల్ పిటీషన్ కొట్టివేసింది. దీంతో సదరు యువకుడికి దిమ్మ తిరిగిపోయింది. బెయిల్ ఇవ్వటానికి ఇలాంటి కారణాలు కూడా కోర్టులు చెబుతాయా? అంటూ షాక్ అయ్యాడు. దీంతో నువ్వు పిచ్చి కారణాలు చెబితే నమ్మటానికి న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అన్నట్లుగా అయ్యింది సరదు అతితెలివి కుర్రాడి పరిస్థితి.
ఈ వింత కేసు విషయానికొస్తే..బాద్లాపూర్కు చెందిన యువకుడు 2012లో ఓ హోటల్లో పనిచేస్తుండేవాడు. హోటల్ కు వచ్చే ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. అలా కొంతకాలం వారి ప్రేమాయణం సాగింది. అతడిని పూర్తిగా నమ్మిన ఆమె శారీరకంగా కూడా దగ్గరైంది. ఫలితంగా గర్భం దాల్చింది. అదే విషయం అతనితో చెప్పింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే నీకు గర్భం కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్ చేయించాడు. ఆ తరువాత కనిపించటమే మానేశాడు.
Read more : ప్రేమించి మోసం చేశాడని వివాహిత ధర్నా
దీంతో అతడిని వెతికి పట్టుకుని నిలదీసింది. పెళ్లి అన్నావ్..అబార్షన్ చేయించావ్..కనిపించకుండాపోయావ్..అంటూ ప్రశ్నించింది. దాంతో అతను మన జాతకాలు కలవలేదు..మనం పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేం అంటూ మాయమాటలు చెప్పాడు. కాబట్టి మనం పెళ్లి చేసుకోవటం జరగదు అని తెగేసి చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె 2013 జనవరి 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువకుడితో పాటు అతని కుటుంబాన్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసుల ముందు యువకుడి కుటుంబం పెళ్లికి అంగీకరించింది. దీంతో యువతి తన కంప్లైంట్ జనవరి 6, 2013 న విత్ డ్రా చేసుకుంది. కానీ ఆ యువకుడు ఎలాగూ కేసు వెనక్కి తీసుకుంది కదాని దాన్ని అలుసుగా చేసుకుని మళ్లీ పాత పాటే పాడాడు. పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read more : ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
మళ్లీ కేసు మొదటికి వచ్చిందని భావించిన పోలీసులు సదరు యువకుడిని చీటింగ్, అత్యాచార చట్టాల కింద అరెస్ట్ చేశారు. తరువాత ఈ కేసు కోర్టుకు వెళ్లింది. ఈ కేసు విచారణంలో యువకుడి తరపు న్యాయవాది రాజా ఠాక్రే..బాంబే హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. జాతకాలు కుదరకపోవడం వల్లే యువతిని తన క్లయింట్ పెళ్లి చేసుకోలేదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ షిండే నిందితుడికి బెయిలు నిరాకరించారు.బాధిత యువతిని పెళ్లి చేసుకునే ఉద్దేశం యువకుడికి లేదని..అందుకే జాతకాలు అవీ ఇవీ అంటూ మోసం చేస్తున్నాడని కాబట్టి బెయిల్ ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పింది. దీంతో సదరు నిందితుడికి దిమ్మ తిరిగిపోయింది. కోర్టును పలు రకాలుగా వేడుకున్నాడు. కానీ బెయిల్ ఇచ్చేది లేదని పిటీషన్ కొట్టివేసింది.
- Marraige :పెళ్ళి చేయట్లేదని తండ్రిని హత్య చేసిన కొడుకు
- Hyderabad : పెళ్లి పేరుతో మహిళను 10లక్షలకు మోసం చేసిన నల్ల జాతీయుడు
- BAIL: పోడు భూముల కేసు.. ఆదివాసి మహిళలకు బెయిల్, విడుదల
- Marriage Twist: ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు: శ్రీకాంత్ భార్య లక్ష్మి
- Bangladesh woman: ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిన యువతి
1Yashwant Sinha: నాడు అలా.. నేడు ఇలా.. హైదరాబాద్‌లో అడుగిడనున్న యశ్వంత్ సిన్హా
2DRDO: మానవ రహిత విమానాన్ని పరీక్షించిన డీఆర్డీఓ.. ప్రయోగం సక్సెస్
3Gorintaku : ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు
4Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్
5Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు
6Bill Gates: ఉద్యోగార్థులకు బిల్ గేట్స్ 48ఏళ్ల నాటి రెజ్యూమ్ తో స్పెషల్ మెసేజ్
7BJP: భారీ ఏర్పాట్లతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ
8Uddhav Thackeray: ఏక్ నాథ్ షిండే పదవులపై ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ డెసిషన్
9PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..
10BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!