Viral video : అతడు క్యాబ్ డ్రైవర్ కాదు.. అందుకే తిరిగి కొట్టాడు.

యువతి, యువకుడు రోడ్డుపై గొడవపడ్డారు. విచక్షణ కోల్పోయిన యువతి, యువకుడి చెంప పగలగొట్టింది. యువకుడు కూడా యువతి చెంప చెళ్లుమనిపించాడు.

Viral video : అతడు క్యాబ్ డ్రైవర్ కాదు.. అందుకే తిరిగి కొట్టాడు.

Viral Video

Viral video : కొద్దీ రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ యువతి క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతిపై నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఈ ఘటనలో యువతి దాడి చేస్తున్నా క్యాబ్ డ్రైవర్ మాత్రం ఆమెపై చేసుకోలేదు. కొడుతుంటే చేతులు కట్టుకొని నిల్చున్నాడు. అయితే తాజాగా ఇటువంటిదే మరో ఘటన జరిగింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇక్కడ యువకుడు క్యాబ్ డ్రైవర్ లా చేతులు కట్టుకు నిల్చోలేదు. తన చెప్పపై కొట్టిన యువతిని లాగిపెట్టి ఒక్కటిచ్చాడు.

వివరాల్లోకి వెళితే.. ఫుట్ పాట్ పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి, తన పక్కన ఉన్న ఓ యువకుడితో గొడవకు దిగింది. చాల సేపు ఒకరినొకరు దూషించుకున్నారు. వీరు గొడవపడుతుండటంతో చుట్టూ ఉన్నవారు వీరి చుట్టూ చేరిపోయారు. ఈ సమయంలోనే విచక్షణ కోల్పోయిన యువతి యువకుడి చెంపపై కొట్టింది. దీంతో యువకుడు తిరిగి ఒక్కటిచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ మరింత పెరిగింది. చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత కూడా చాలా సేపు గొడవపడ్డారు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు తమ ఫోన్ లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అందరు క్యాబ్ డ్రైవర్ లా ఉండరని కొందరు అంటే.. మంచిగా స్పందించావు.. ఇలాంటి చురుకైన అమ్మాయిలకు నీలాంటి వాడే కరెక్ట్ అని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది స్క్రిప్ట్ వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది.

 

 

View this post on Instagram

 

A post shared by Addu (@mohdadnan002)