Broadband Prices : మరో బాదుడు..? పెరగనున్న బ్రాడ్ బ్యాండ్ టారిఫ్ ధరలు..!

ఇప్పటికే మొబైల్ రీచార్జ్ ధరలు భారీగా పెరిగాయి. అన్ని టెలికం కంపెనీలు చార్జీలను అమాంతం పెంచేశాయి. వినియోగదారులపై అదనపు భారం మోపాయి. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి ధరల మోత..

Broadband Prices : మరో బాదుడు..? పెరగనున్న బ్రాడ్ బ్యాండ్ టారిఫ్ ధరలు..!

Broadband Prices

Broadband Prices : ఇప్పటికే మొబైల్ రీచార్జ్ ధరలు భారీగా పెరిగాయి. అన్ని టెలికం కంపెనీలు చార్జీలను అమాంతం పెంచేశాయి. వినియోగదారులపై అదనపు భారం మోపాయి. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి ధరల మోత మోగనుంది.

ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు ధరల బాదుడుకు రెడీ అయ్యాయి. బ్రాడ్ బ్యాండ్ ధరలూ పెరగనున్నాయి. కొన్నిరోజుల్లో కేబుల్ ఇంటర్నెట్ బిల్లులు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు తక్కువ ధరలకే బ్రాడ్ బ్యాండ్ సేవలందించిన కంపెనీలు, పెద్ద మొత్తంలో నష్టాల్లో కూరుకుపోయాయట. ఇప్పుడు రేట్లు పెంచకపోతే, మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కష్టంగా మారుతుందని వాపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్రాడ్ బ్యాండ్ రేట్లను పెంచేందుకు బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!

మొబైల్ రీఛార్జి ధరలు ఏ మేర పెరిగాయో, అంతే స్థాయిలో బ్రాడ్ బ్యాండ్ రేట్లను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయట. బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కొంటున్నాయని, కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు కంపెనీల మధ్య పోటీ పెరిగిందని కోల్ కతాకు చెందిన మేఘ్‌బెల్లా బ్రాడ్ బ్యాండ్ కో ఫౌండర్ తపవ్రతా ముఖర్జీ చెప్పారు. బ్రాడ్ బ్యాండ్ రేట్లను కూడా 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచాల్సి ఉందన్నారు.

మార్కెట్ ట్రెండ్‌ను చూస్తే, తాము ఓటీటీ(ఓవర్ ద టాప్) స్ట్రీమింగ్ సేవలను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే అందిస్తున్నాం. ఇది ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లపై మరింత ఒత్తిడిని పెంచింది. ఎయిర్‌టెల్, జియో వంటి టాప్ టెల్కోలు కూడా తమ టారిఫ్‌లను సమీక్షించాలి. దీంతో చిన్న కంపెనీలు కూడా టారిఫ్‌లను సమీక్షించగలవు. లేకపోతే, కస్టమర్లు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారే అవకాశం ఉందని తపవ్రతా ఆవేదన వ్యక్తం చేశారు.

WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్

చిన్న కంపెనీల మధ్య పోటీ తక్కువగానే ఉన్నా… పెద్ద కంపెనీలు చిన్న సిటీల్లోకి ప్రవేశించడంతో, చిన్న కంపెనీల మధ్య కూడా ఇటీవల పోటీ పెరిగింది. ఈ పోటీతో చిన్న బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కస్టమర్లకు మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలందించాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ టారిఫ్‌లను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి.

ఇటీవలే దేశంలో పెద్ద టెలికాం కంపెనీలు (జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా) మొబైల్ టారిఫ్ రేట్లను 20 శాతం పెంచాయి. టెలికాం వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లాలంటే, టారిఫ్ రేట్లను పెంచడం తప్పనిసరి అని కంపెనీలు చెప్పాయి. తొలుత ఎయిర్‌టెల్, ఆ తర్వాత వొడాఫోన్ ఐడియా, చివరికి రిలయన్స్ జియో కూడా మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచి కస్టమర్లకు షాకిచ్చాయి. ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు కూడా షాక్ ఇవ్వనున్నాయి.