#BudgetSession2023: ఓ వైపు కేంద్ర మంత్రులతో మోదీ భేటీ.. మరోవైపు ప్రతిపక్షాలతో కాంగ్రెస్ సమావేశం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

#BudgetSession2023: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రతిపక్ష పార్టీలు ఏయే ప్రశ్నలు సంధిస్తాయి? వాటికి ఎలా బదులివ్వాలి? వంటి అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు. కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రతి ప్రతిపక్ష పార్టీలతో కలిసి సమావేశం నిర్వహించింది. అదానీ గ్రూప్ వ్యవహారం, దేశంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, చైనాతో పొంచి ఉన్న ముప్పు వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.
ప్రతిపక్షాలతో సమావేశం ముగిశాక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు వంటి అంశాలపై తాము వాయిదా తీర్మానం (267 నిబంధన కింద) నోటీసు ఇచ్చామని చెప్పారు. కాగా, పార్లమెంటులో రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇవాళ దానిపై మాట్లాడతారు.
North Korea: అమెరికా, దాని మిత్రదేశాలకు ఉత్తర కొరియా హెచ్చరిక