కేరళ స్మార్ట్ టెక్నిక్: బస్సు ఎక్కినా, దిగినా శానిటైజర్లు వాడాల్సిందే..

  • Published By: veegamteam ,Published On : March 20, 2020 / 06:44 AM IST
కేరళ స్మార్ట్ టెక్నిక్: బస్సు ఎక్కినా, దిగినా శానిటైజర్లు వాడాల్సిందే..

కరోనా వైరస్‌ను కేరళ చాలా తెలివిగా ఎదుర్కొంటోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ను కంట్రోల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. రీసెంట్ గా కేరళ పోలీసులు డ్యాన్స్ చేస్తూ.. చేతులు కడుక్కొవాలని, శానిటైజర్ వాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా బస్సుల్లో ప్రయాణికులందరికీ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు టికెట్ తో పాటు హ్యాండ్ శానిటైజర్ ఇస్తున్నారు. 

అంతేకాదు ఉత్తర కేరళలోని కోజికోడ్ జిల్లాలో బస్ స్టాపుల్లో హ్యాండ్స్ వాష్ చేసుకోడానికి వాష్ బేషన్లను నిర్మించారు. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి వైరస్ సోకకుండా ఉంటుంది. ప్రయాణికులు బస్ ఎక్కేముందు హ్యాండ్స్ వాష్ చేసుకుని ఎక్కాలి, బస్సులో ఉన్నంత వరకు మాస్కు పెట్టుకోవాలి, బస్సు దిగిన వెంటనే అక్కడున్న వాష్ బేషన్ దగ్గర హ్యాండ్స్ వాష్ చేసుకోని వెళ్లాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి వైరస్ ధరిచేరదని కేరళ ప్రభుత్వం తెలిపింది. 

ఇదంతా అక్కడున్న వ్యక్తి వీడియో తీసి ట్వట్టర్ లో షేర్ చేశారు. COVID-19తో ఫైట్ చేస్తూ కేరళ ప్రభుత్వం #BreakTheChain అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో కోజికోడ్ జిల్లాలోని నాన్మండా ప్రజలు బస్ స్టాప్ వద్ద చేతులు కడుక్కోడానికి వాష్ బేషన్లు నిర్మించారని టాగ్ చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.