Covid Vaccine: సంవత్సరం చివరికీ.. కొవిడ్ వ్యాక్సిన్ అందరికీ – హర్ష్ వర్ధన్

యావత్ దేశం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతుంది. ఇలాంటి సమయంలో కావాల్సింది ఒక్కటే వ్యాక్సిన్. వీలైనంత త్వరగా దానిని రెడీ చేసి...

Covid Vaccine: సంవత్సరం చివరికీ.. కొవిడ్ వ్యాక్సిన్ అందరికీ – హర్ష్ వర్ధన్

Covid Vaccine

Covid Vaccine: యావత్ దేశం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతుంది. ఇలాంటి సమయంలో కావాల్సింది ఒక్కటే వ్యాక్సిన్. వీలైనంత త్వరగా దానిని రెడీ చేసి ఈ ఏడాది చివరికల్లా అందరికీ అందేలా చేస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ శుక్రవారం వెల్లడించారు.

వ్యాక్సిన్ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్ధతు ఇస్తుంది. జనాభాకు తగ్గట్లుగా ప్రొడక్షన్ జరిగేలా చూస్తున్నాం. ఆగష్టు నుంచి డిసెంబర్ మధ్యలో 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు రెడీ అవుతాయి. జులై నెలలోనే 51 కోట్ల డోసులు రానున్నాయని వర్ధన్ కొవిడ్ రివ్యూ మీటింగ్ లో అధికారులతో చెప్పారు. ఈ మీటింగ్ లో 9రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుతం దేశంలో కొవిడ్ పరిస్థితి ఎనిమిది రోజులుగా కాస్త మెరగువుతుంది. గత ఐదు రోజులుగా 3లక్షల కంటే తక్కువ కేసులే నమోదువుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 20లక్షల 61వేల 683మందికి టెస్టులు జరిపారు.

రాష్ట్రాలు కొవిడ్ వ్యాక్సిన్ వేస్ట్ అవకుండా చూడాలని మంత్రి అన్నారు. సెకండ్ డోస్ కోసమే వాటిని రిజర్వ్ చేశారని.. రాష్ట్రాలు ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ పాలసీని కంటిన్యూ చేయాలని పిలుపునిచ్చారు.