ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్: పెరగనున్న జీతాలు

  • Published By: vamsi ,Published On : October 12, 2019 / 06:01 AM IST
ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్: పెరగనున్న జీతాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది మోడీ ప్రభుత్వం. డియర్ నెస్ అలవెన్స్‌‌(డీఏ)ను 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల డీఏ 12 నుంచి 17 శాతానికి పెరిగింది. దీంతో ఉద్యోగులు సహా పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది. అలాగే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టీఏ) కూడా పెంచింది.

డీఏ పెంపు కారణంగా టీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.810 నుంచి రూ.4,320 వరకు పెరగనుంది. ఉద్యోగుల వేతనంలో ప్రతి నెలా ఈ అలవెన్స్ ఆటోమేటిక్‌గానే యాడ్ అవుతుంది. టీఏ పెంపు, డీఏ పెంపు అనేవి ఇంటర్ కనెక్టెడ్‌గా ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగి నియామకమైన సిటీ కేటగిరి ప్రాతిపదికన ట్రావెల్ అలవెన్స్‌ను అందించేందకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

7వ సీపీసీ ప్రకారం.. అర్బన్ సిటీస్‌లో పనిచేసే ఉద్యోగులకు టీఏ కనీసం రూ.1,350 ఉండగా.. గరిష్టంగా రూ.7,200 ఉంది. అలాగే చిన్న పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు టీఏ రూ.900 నుంచి రూ.3,600 మధ్యలో ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. టైర్ 1 పట్టణాల్లో డీఏ 5 శాతం పెరిగినప్పుడు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కూడా 5శాతం మేర పెరుగుతుంది. అంటే అప్పుడు టైర్1 పట్టణాల్లో ఉద్యోగుల రూ.7,200 అప్రూవ్డ్ టీఏ రూ.360 అవుతుంది. దీంతో ఏడాదిలో ఉద్యోగుల జీతం రూ.4,320 పెరుగబోతుంది.