కేరళలో పరుగులు పెట్టనున్న సెమీ హైస్పీడ్ రైల్ : కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 07:50 AM IST
కేరళలో పరుగులు పెట్టనున్న సెమీ హైస్పీడ్ రైల్ : కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేరళలో త్వరలో హైస్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. తిరువనంతపురం నుంచి కసరాగఃడ్ వరకూ సెమీ హౌస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. గతంలో  తిరువనంతపురం నుంచి కాసరాగోడ్ కు వెళ్లాలంటే 12 గంటలు పట్టేంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే 12 గంటల సమయం కేవలం 4 గంటలకు తగ్గనుంది. 

కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. డబుల్ లైన్‌గా చేపట్టే ఈ మార్గంపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు తీయనున్నాయి. అధ్యయనం బృందం ప్రాజెక్ట్ నివేదిక అనంతరం కేరళ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. 

532 కిలోమీటర్ల ప్రయాణమార్గంగా గల ఈ ప్రాజెక్ట్‌ను పర్యావరణహిత ప్రాజెక్ట్‌గా పట్టాలకు ఎక్కించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఈ రైలు కారిడార్ ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తితో తక్షణమే 11 వేల మంది ఉద్యోగావకాశాలు పొందుతారన్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు రూ.66,079 వేల కోట్లు ఖర్చు కానున్నాయి.