Lockdown:లాక్‌డౌన్‌పై నిర్ణయం రాష్ట్రాలదే.. కేంద్రం ఆలోచన ఏంటంటే?

జూన్ 1వ తేదీ నుంచి తమ అధికార పరిధిలోని దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కఠినతరం చేయాలా? లేదా అదనపు సడలింపులు ఇవ్వాలా? అనే దానిపై నిర్ణయాలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకునే అవ

Lockdown:లాక్‌డౌన్‌పై నిర్ణయం రాష్ట్రాలదే.. కేంద్రం ఆలోచన ఏంటంటే?

Lockdown

Lockdown::జూన్ 1వ తేదీ నుంచి తమ అధికార పరిధిలోని దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కఠినతరం చేయాలా? లేదా అదనపు సడలింపులు ఇవ్వాలా? అనే దానిపై నిర్ణయాలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకునే అవకాశం కల్పించాలని కేంద్రం భావిస్తుంది. అయితే 80శాతం పాజిటివ్‌ కేసులు ఉన్న 30 మున్సిపల్‌ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసే అవకాశం ఉంది.

ఈ 30 ప్రాంతాలు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ మరియు ఒడిశా ప్రాంతాలకు చెందినవి. అంతర్జాతీయ విమానాలు మరియు రాజకీయ సమావేశాల నిర్వహణతో పాటు మాల్స్ మరియు సినిమా హాళ్ళను మాత్రం మూసివెయ్యాలని కేంద్ర ప్రభుత్వం కోరనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని, ప్రతిచోటా సామాజిక దూర నిబంధనలను నిర్వహించడం మంచిదని, కేంద్రం సూచించనుంది.

పాఠశాలలను తిరిగి తెరవడం లేదా మెట్రో రైలు సేవలను పున: ప్రారంభించడంపై రాష్ట్రాలకే అనుమతులు ఇవ్వవచ్చు. ఇప్పటి నుంచి ప్రతీ పదిహేను రోజులకు లాక్‌డౌన్ చర్యలు సమీక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రాలు తమ అధికార పరిధికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని తీసుకోవచ్చు. మతపరమైన ప్రదేశాలలోకి అనుమతించడంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు మరియు ఇతర మత ప్రదేశాలను తిరిగి తెరవడానికి కర్ణాటకను అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి యెడియరప్ప ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాశారు. కాగా దీనిపై నిర్ణయం ముఖ్యమంత్రులకే కేంద్రం వదిలేయనుంది.

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మార్చి 24 న 21 రోజుల పాటు ప్రధాని ప్రకటించారు. ఇది మొదట మే 3 వరకు మరియు తరువాత మే 17 వరకు పొడిగించబడింది. చివరగా మే 31 వరకు పొడిగించబడింది. అయితే లాక్‌డౌన్‌ పెట్టినా కూడా కరోనా కంట్రోల్ కాలేదు.. 30 నగరాల్లోని COVID-19 పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా మరియు చెన్నై నాలుగు మెట్రో నగరాల్లోనూ భారీగా కేసులు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ వారి అభిప్రాయాలను కోరారు. అయితే, కొన్ని రాష్ట్రాలు 50 శాతం సామర్థ్యంతో సామాజిక దూరంతో రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అవకాశం కోరుతున్నాయి.

ఇక ఇదే సమయంలో పెద్ద నగరాలు లేదా వైరస్ బాధిత ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు, ఇతర వ్యక్తులు వచ్చిన తరువాత బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొరోనావైరస్ కేసులు వేగంగా పెరగడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది.

కొన్ని రాష్ట్రాలు అయితే బయటి నుంచి ప్రజల ప్రయాణాన్ని అరికట్టాలని కోరుకుంటున్నాయి. అయితే, ఇలాంటి నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యం కాదని అధికారి తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి విమాన ప్రయాణాన్ని నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు కోవిడ్ -19 పాజిటివ్‌గా ఉన్నారు.

భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య శుక్రవారం(29 మే 2020) నాటికి 1,65,799 కు చేరుకుంది. ప్రపంచంలోనే కరోనావైరస్ మహమ్మారి ఎక్కువగా సోకిన తొమ్మిదవ దేశంగా నిలిచింది. COVID-19 వల్ల మరణించిన వారి సంఖ్య దేశంలో 4,706కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.