చంద్రయాన్ కథ ముగియలేదు : ఇస్రో ఛైర్మన్ కె.శివన్

  • Published By: madhu ,Published On : November 2, 2019 / 09:56 AM IST
చంద్రయాన్ కథ ముగియలేదు : ఇస్రో ఛైర్మన్ కె.శివన్

చంద్రయాన్ – 2 కథ ముగియలేదని ఇస్రో చీఫ్ కె.శివన్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్‌లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరిన్ని ప్రయోగాలు చేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే నెలల్లో పెద్ద సంఖ్యలో ఉపగ్రహ ప్రయోగాలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం ఢిల్లీలోని ఐఐటీ స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో ల్యాండింగ్ సరిగ్గా చేయలేకపోయామని..కానీ చంద్రుడి ఉపరితలం నుంచి 300 మీటర్ల దగ్గరగా మిషన్లు పనిచేయడం జరిగిందన్నారు. అంతేగాకుండా..విలువైన సమాచారాన్ని రాబట్టడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 

ఆదిత్య L1 సోలార్ మిషన్ ప్రయోగంపై కసరత్తులు జరుగుతున్నాయని, ఎస్ఎస్ఎల్‌వి డిసెంబర్ లేదా జనవరిలో, 200 టన్నుల సెమీక్రయో ఇంజిన్ పరీక్ష త్వరలో ప్రారంభం కానుందన్నారు. మొబైల్ ఫోన్‌లలో నావిక్ సిగ్నల్స్ అందించే పని కొనసాగుతోందని, ఇది సామాజిక అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. ఐఐటీ బాంబే నుంచి తాను గ్రాడ్యుయేట్ తీసుకున్నట్లు, ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ముందున్నాయని తెలిపారు. ఎంతో అనుభవం సంపాదిస్తున్నారని..అయితే..కెరీర్ ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డబ్బు కోసం ఉద్యోగాన్ని ఎంచుకోవడం కంటే..ఆనందం కోసం దాన్ని ఎంచుకోవాలన్నారు. చేసే పనిలో మంచిగా ఉండాలని..నైపుణ్యాలు..బలాలు కూడా అవసరమని వ్యాఖ్యానించారు. 
Read More : PF గుడ్ న్యూస్: UAN కావాలంటే కంపెనీతో పనిలేదు