దేశంలో తొలిసారి: ఓటేసిన మానసిక రోగులు 

  • Published By: vamsi ,Published On : April 18, 2019 / 06:22 AM IST
దేశంలో తొలిసారి: ఓటేసిన మానసిక రోగులు 

దేశ చరిత్రలో ఓ అరుదైన ఘటన సార్వత్రిక ఎన్నికల వేళ చోటుచేసుకుంది. చెన్నైలోని ఓ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో వాళ్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.  దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇది తొలిసారి కావడం విశేషం.
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

చెన్నైలోని కీల్పాక్ ప్రాంతంలో ఉన్న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆసుపత్రిలో 500 మందికి పైగా మానసిక వికలాంగులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఓటు హక్కు ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ ఆసుపత్రి అధికారులు.. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి వర్గాల అభ్యర్ధులను పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.

దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఇప్పటివరకు మానసిక వికలాంగులు ఎవరికి కూడా ఇటువంటి అవకాశం దక్కలేదు. వారు ఓటు వేసేందుకుగాను రెండు నెలల నుంచి ఆసుపత్రి అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఈ ఎన్నికల్లో మొత్తం 159 మంది మానసిక రోగులు ఓటు వేశారు. మొత్తం192 మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చగా.. అందులో 114 మంది పురుషులు, 78 మంది మహిళలు ఉన్నారు. చెన్నై సెంట్రల్ లోక్ సభ పరిధిలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు.