ఆవు దూడను దత్తత తీసుకున్న రైతు

ఆవు దూడను దత్తత తీసుకున్న రైతు

Childless farmer adopts calf as ‘son : పిల్లలు లేని రైతు ఆ లోటు తీర్చుకోవడం కోసం వింత నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో పుట్టిన ఆవు దూడనే కొడుకుగా దత్తత తీసుకున్నాడు. పవిత్రమైందిగా భావించే ఆవుకు పుట్టిన దూడనే తన సంతానం అంటున్నాడు. ఆవు నుంచి వచ్చే పాలు, మూత్రము, పేడని పలు కార్యక్రమాల్లో ఉపయోగించే ఆరాధ్య జంతువు అతని పాలిట కామధేనువు అయిపోయింది.

సంతానం లేదని..ఆవు దూడను దత్తతగా తీసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. విజయ్ పాల్, రాజేశ్వరి దేవి దంపతులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రుల మరణం తర్వాత..షాజహాన్పూర్ ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు చెల్లెళ్లకు వివాహం జరిగింది.

వీరికి కూడా వివాహం జరిగి 15 సంవత్సరాలు పూర్తయింది. అయినా వారికి సంతానం కలగలేదు. ఇదే సమయంలో వారి దగ్గరే పెంచుకుంటున్న ఆవుకు ఓ దూడ పుట్టింది. దూడుకు జన్మినిచ్చిన ఆవు మృత్యువాతకు గురైంది. ఒంటరిగా మిగిలిపోయిన దూడను దత్తత తీసుకోవాలని దంపతులు నిర్ణయించారు.

ఏదో ప్రేమగా చూసుకోవడం మాత్రమే కాకుండా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి mundan కార్యక్రమంలో Laltu Babaగా పేరు పెట్టుకున్నారు. అంతకు ముందు Laltu Babaను గోమతి నది వద్దకు తీసుకెళ్లి పూజలు నిర్వహించారు.

ఈ వేడుకకు 500 మంది అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో ఉన్న వారు బహుమతులతో ఈ వేడుకకు హాజరయ్యారు. వచ్చిన వారికి రైతు దంపతులు విందు ఇచ్చారు. ఆవును తల్లిగా చూసినప్పుడు..దాని దూడను కొడుకుగా ఎందుకు తీసుకోకూడదని విజయపాల్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూసి తొలుత ఆశ్చర్యపోయినా..తర్వాత సంతోషం కలిగిందని స్థానికుడు రత్నేష్ మిశ్రా వెల్లడించారు.