3rd Covid-19 : కరోనా థర్డ్ వేవ్, పిల్లలపై ప్రభావం, భయం వద్దు!

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్‌ కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండదని తెలిపింది. పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 10 వేల మందిపై సీరో సర్వే నిర్వహించారు.

3rd Covid-19 : కరోనా థర్డ్ వేవ్, పిల్లలపై ప్రభావం, భయం వద్దు!

Who Corona Third Wave

3rd Covid-19 Wave Children: దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్‌ కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండదని తెలిపింది. పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 10 వేల మందిపై సీరో సర్వే నిర్వహించారు.

ప్రస్తుతం 4వేల 509 మందికి సంబంధించిన ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. వీరిలో 7వందల మంది 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు కాగా.. 3వేల 809 మంది 18 ఏళ్ల పైబడినవారు. వీరిలో సగటు వయసు ఢిల్లీ అర్బన్‌లో 11 ఏళ్లు, ఢిల్లీ రూరల్‌లో 12 ఏళ్లు, భువనేశ్వర్‌లో 11 ఏళ్లు, గోరఖ్‌పూర్‌లో 13 ఏళ్లు, అగర్తలాలో 14 ఏళ్లుగా ఉంది. మార్చి 15, జూన్‌ 10 మధ్య నమూనాలు సేకరించారు.

పిల్లల్లో సార్స్‌-కొవ్‌-2 సీరో-పాజిటివిటీ ఎక్కువగా ఉందని.. వయోజనులతో పోలిస్తే సమానంగా ఉందని అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏ వేరియంట్‌ వల్లనైనా భవిష్యత్తులో థర్డ్‌ వేవ్‌ వస్తే దాని ప్రభావం పిల్లలపై మాత్రమే అధిక ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది. థర్డ్ వేవ్ అని.. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని అపోహకు గురికావొద్దని స్పష్టంచేసింది. ఈ అధ్యయనం మనోధైర్యం కలిగిస్తోంది. పిల్లలకు ఏం కాదు అని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.