Bipin Rawat : తమిళనాడులో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌లో ‘బిపిన్‌ రావత్‌’

సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్రయాణిస్తున్న mi-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రావత్ తోపాటు మొత్తం 14మందితో వెళ్తున్న ఈ హెలికాప్టర్ తమిళనాడులోని కునూరులో కుప్పకూలింది.

Bipin Rawat : తమిళనాడులో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌లో ‘బిపిన్‌ రావత్‌’

Bipin Rawat

Bipin Rawat : చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ పాటు మరో 13 మంది ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో కూలిపోయిందని భారత వైమానిక దళం తెలిపింది. ప్రమాద స్థలంలో ఐదు మృతదేహాలు గుర్తించారు అధికారులు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

విమానంలో మొత్తం 14 మంది ఉండగా.. వీరిలో రావత్ కుటుంబానికి చెందిన వారు కూడా ఉన్నారని తెలుస్తుంది. రావత్ భార్య, ఆయన డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమాండోలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ విమానంలో ఉన్నట్లు భారత వైమానిక దళం ఒక ట్వీట్‌లో ధృవీకరించింది. అతను ఈ రోజు తెల్లవారు జామున ఢిల్లీ నుండి సూలూర్‌కు బయలుదేరారు.

లభ్యమైన ఐదు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో కావడంతో అధికారులకు మంటలు ఆర్పడం ఇబ్బందిగా మారింది. సరైన నీటి వసతి లేకపోవడంతో చిన్నపాటి పైపులద్వారా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

త‌మిళ‌నాడులో కుప్ప‌కూలిన డిఫెన్స్ హెలికాఫ్ట‌ర్ ఘ‌ట‌నపై కేంద్ర క్యాబినెట్ అత్య‌వ‌స‌రంగా స‌మావేశమైంది. హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదం గురించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ వివ‌రించారు. ఈ ప్ర‌మాదంపై ప్ర‌ధాని ఉన్న‌త‌స్ధాయి స‌మీక్ష నిర్వ‌హించారు.