సీఎం కన్యాదాన్ పథకం : ఒకేసారి 1330 వివాహాలు

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 06:38 AM IST
సీఎం కన్యాదాన్ పథకం : ఒకేసారి 1330 వివాహాలు

ఛింద్వాడా: పెళ్లి అంటేనే సందడి..పెళ్లి జరగుతుందంటే  ఆచుట్టు పక్కల అంతా సందడే..సందడి వాతావరణం ఉంటుంది. అటువంటి ఒకేచోట..ఒకేసారి 1330 పెళ్లిళ్లు జరిగితే ఇక ఆ సందడి గురించి ప్రత్యేకించి చెప్పాలా..మీరే ఊహించుకోండి..ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వాడాలో జరిగింది. 
 

సీఎం  కన్యాదాన్ పథకం కింద 1330 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి.. మేళతాళాలు.. బాణాసంచా సందళ్లతో ఈ వివాహాలను నిర్వహించారు. ఈ సామూహిక వివాహాలను తిలకించేందుకు ప్రజలు పలు ప్రాంతా నుంచి అధికసంఖ్యలో హాజరయ్యారు. పలు జిల్లాలోని ఆయా పంచాయతీల నుంచి వివాహాల కోసం అందిన దరఖాస్తుల మేరకు ఈ వివాహాల  వేడుక  సాయంత్రం 5 గంటలవరకూ కొనసాగింది.

ఈ అరుదైన..అద్భుతమైన కార్యక్రమానికి కలెక్టర్  శ్రీనివాస్ శర్మ హాజరై వధూవరులను శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం సీఎం కమల్‌నాథ్ పంపించిన శుభ సందేశాన్ని చదివి వినిపించారు. సీఎం కన్యాధాన్ పథకం కింది జరిగిన ఈ సామూహిక వివాహాలతో ఏకమైన జంటలు జీవితాంతం కలిసివుండాలని సీఎం అభిలషిస్తు..నూతన జంటలకు అభినందనలు తెలిపారు.